Trisha Krishnan : ట్రెడిషనల్ లుక్‌లోనే ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష హీట్ పుట్టిస్తోంది. పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఈ భామ రోజుకో రకమైన ఔట్ఫిట్తో మతి పోగొడితోంది. తాజాగా త్రిష రెడ్ కలర్ డ్రెస్సులో రావిషింగ్ లుక్స్‌తో మెస్మరైజ్ చేసింది. సంప్రదాయ దుస్తుల్లోనూ కవ్వించే పోజులిస్తూ మైమరిపించింది. ప్రస్తుతం త్రిష లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పొన్నియిన్ సెల్వన్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా త్రిష కొచ్చికి వెళ్లింది. కొచ్చి ప్రమోషన్స్‌లో ఈ బ్యూటీ రెడ్ కలర్ ఔట్‌ఫిట్‌ను సెలక్ట్ చేసుకుంది. ఈ ఔట్ఫిట్ త్రిష నడుం ఎక్స్పోజ్ చేస్తూ కుర్రాళ్లను కవ్వించింది. మెస్మరైజింగ్ స్మైల్‌తో స్టన్నింగ్ లుక్స్‌తో కుర్రాళ్ల మనసు దోచేసింది.
మూడు పదుల వయసు దాటినా ఈ భామ ఇంకా పదహారేళ్ల పడుచు పిల్లలాగే కనిపిస్తోంది. రోజురోజుకు పెరిగిపోతున్న త్రిష అందం అమ్మాయిలు కుళ్లుకునేలా ఉంది. నేటి యంగ్ హీరోయిన్లకు స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తూ త్రిష ఓవైపు సినిమాలు.. మరోవైపు ఫ్యాషన్ ట్రెండ్‌లో దూసుకెళ్తోంది.త్రిష సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
ఈ బ్యూటీ సోషల్ మీడియా అకౌంట్లో అన్ని ఫొటోలు అయితే ట్రెడిషనల్.. లేకపోతే క్యాజువల్.. మరీ అయితే ట్రెండీగా కనిపిస్తాయి. అంతే తప్ప ఒక్క బోల్డ్ ఫొటో కూడా కనిపించదు. ఈ భామ ముందు నుంచి బోల్డ్నెస్కు కాస్త దూరంగా ఉంటోంది. ఇక రీసెంట్గా ఏ ఈవెంట్‌కు హాజరైనా ఈ బ్యూటీ ట్రెడిషనల్ లేదా ట్రెండీ ఔట్ఫిట్స్లో ఎక్కువగా కనిపిస్తోంది. త్రిష డ్రెస్సింగ్ సెన్స్‌కు నేటి తరం యువత ఫిదా అవుతున్నారు.
ఇక త్రిష కెరీర్ సంగతికి వస్తే ఈ భామ వర్షం సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ రిలీజ్ అయి దాదాపు ఇరవై ఏళ్లు కావొస్తున్నా ఫస్ట్ మూవీలో ఎంత అందంగా నాజూగ్గా ఉందో.. త్రిష ఇప్పటికీ అలాగే ఉంది. ఫస్ట్ మూవీతో ఎవర్గ్రీన్ హిట్ కొట్టిన త్రిష ఆ తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్, కోలీవుడ్‌లలో దూసుకెళ్లింది. ప్రస్తుతం మాత్రం ఈ బ్యూటీ తన ఫోకస్ అంతా కోలీవుడ్‌పైనే పెట్టింది.