Naresh – Pavitra ఇటీవల కాలం లో సోషల్ మీడియా లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన జంట నరేష్ – పవిత్ర..ముదురు వయస్సు లో పెళ్లి చేసుకున్న ఈ జంటపై ఎన్ని విమర్శలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.దానికి తోడు నరేష్ లిప్ కిస్ ఇస్తూ వీడియో అప్లోడ్ చెయ్యడం,జనాలు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా తన ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించడం వంటివి నరేష్ పై జనాల్లో ఉన్న గౌరవాన్ని తగ్గించేలా చేసింది.

ఎప్పుడైతే ఆయన పవిత్ర ని పెళ్లి చేసుకున్నాడో, అప్పటి నుండి ఆయన సినిమాల్లో అవకాశాలు బాగా తగ్గిపోయాయి.అంతకు ముందు నరేష్ లేని సినిమా అంటూ ఉండేది కాదు, అంత డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ అకస్మాత్తుగా పడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.ఇది ఇలా ఉండగా నరేష్ పెళ్లి చేసుకుంటున్న సమయం లో ఆయన కుటుంబం లో ఉన్న వాళ్లంతా చాలా తీవ్రంగా వ్యతిరేకించారట.

ముఖ్యంగా మహేష్ బాబు ఇలాంటి చాలా తీవ్రంగా వ్యతిరేకించాడట.ఘట్టమనేని కుటుంబానికి ఇండస్ట్రీ లో ఉన్న స్థానం చాలా గొప్పదని, ఇలా పెళ్లి చేసుకొని పరువు తియ్యొద్దు అంటూ మహేష్ బాబు చాలా వరకు ఆపడానికి ప్రయత్నం చేసాడట.కానీ నరేష్ మాత్రం ఆయన మాట వినలేదు.దీనితో మహేష్ బాబు నరేష్ తో శాశ్వతంగా విడిపోయినట్టు ఫిలిం నగర్ లో ఒక టాక్ వినిపిస్తుంది.నరేష్ – పవిత్ర పెళ్ళికి కూడా మహేష్ బాబు మరియు ఆయన కుటుంబం హాజరు కాలేదు.

సూపర్ స్టార్ కృష్ణ చనిపోయిన తర్వాత నరేష్ ని పూర్తిగా ఘట్టమనేని ఫ్యామిలీ కి దూరం పెట్టినట్టు తెలుస్తుంది.మహేష్ బాబు అలా కోపగించుకోవడం లో కూడా తప్పు లేదు, ఎందుకంటే ఒక్క మచ్చ కూడా లేని ఫ్యామిలీ ఘట్టమనేని ఫ్యామిలీ, కనీసం డిగ్నిటీ అయినా మైంటైన్ చెయ్యాలి, సోషల్ మీడియా లో లిప్ కిస్ ఇస్తూ వీడియోలు పెట్టడం, పెళ్ళికి సంబంధించిన వీడియో ని ఎదో ఘనకార్యం చేస్తున్నట్టు పెట్టడం వంటివి మహేష్ కి ఏమాత్రం నచ్చలేదట,మరి రాబొయ్యే రోజుల్లో అయినా వీళ్ళు కలుస్తారో లేదో చూద్దాము.