Rudhrudu : రాఘవ లారెన్స్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రుద్రుడు’ నిన్న తెలుగు మరియు తమిళం బాషలలో ఘనంగా విడుదలై పర్వాలేదు అనే రేంజ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకి తొలి నుండి పెద్దగా ప్రొమోషన్స్ చెయ్యలేదు.అందువల్ల ఈ సినిమా అనేది ఒకటి ఉందనే విషయమే గుర్తించలేదు ఆడియన్స్.అందువల్ల నిన్న మొదటి రెండు షోస్ కి జనాలు పెద్దగా రాలేదు.

కానీ సాయంత్రం ఆటల నుండి థియేటర్స్ మొత్తం హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడిపోయింది.నిన్న ఈ చిత్రం తో పాటుగా సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘శాకుంతలం‘ చిత్రం కూడా విడుదలైంది.ఆ సినిమాకి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ రావడం ‘రుద్రుడు’ కి బాగా కలిసొచ్చిన అంశం.పైగా లారెన్స్ కి మొదటి నుండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాస్ లో మంచి క్రేజ్ ఉండడం కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యింది.

అందువల్ల ఓపెనింగ్స్ అదిరాయి.ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 7 కోట్ల రూపాయలకు జరిగింది.మొదటి రోజు ఈ చిత్రానికి 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట.పబ్లిసిటీ లేకుండా ఇంత వసూళ్లు రావడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.ఇక రెండవ రోజు కూడా ఈ సినిమాకి మొదటి రోజుకంటే మెరుగైన ఆక్యుపెన్సీలతో ప్రారంభం అయ్యింది.అన్నీ కలిసి వస్తే నేడు ఈ సినిమాకి కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

అలా మొదటి మూడు రోజులకు కలిపి ఈ సినిమా మూడు కోట్ల రూపాయిల షేర్ ని రాబడుతుందని అంచనా.కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో నాలుగు కోట్ల రూపాయిలు వసూలు చెయ్యాల్సి ఉంటుంది.అంటే మరో వీకెండ్ కూడా బలమైన షేర్స్ ని రాబట్టాలి.మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అని అనుమానం పడుతున్నారు బయ్యర్స్.కానీ సమ్మర్ సీజన్ కనుక కచ్చితంగా లాంగ్ రన్ ఉంటుందని, బ్రేక్ ఈవెన్ చాలా తేలికగా అవుతుందని అంటున్నారు, చూడాలి మరి.
