Samantha: సమంతపై తనకున్న ప్రేమను తెలిపిన విజయ్ దేవరకొండ

- Advertisement -

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా కోసం కోటి కళ్లతో ఎదురుచూస్తుంది. దానితోపాటు విజయ్ సరసన ఖుషి అనే రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సమంత అనారోగ్యం కారణంగా పోస్ట్‌పోన్ అయ్యింది. ఇటీవలే తిరిగి షూటింగ్ మొదలుపెట్టుకొని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా సమంత నటించిన మరో సినిమా శాకుంతలం (Shaakuntalam) రేపు (ఏప్రిల్ 14) రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే విజయ్, సమంతకు ఒక లేఖ రాశాడు.

Samantha
samantha

‘‘సమంత.. నువ్వు ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా, ఇతరులతో ప్రేమగా ఉంటావు. ఎంపిక చేసుకునే సినిమాలపైనే కెరీర్‌ ఆధారపడి ఉంటుందని భావిస్తావు. అనారోగ్యంతో బాధపడుతున్నా.. విశ్రాంతి తీసుకోవాల్సి ఉన్నా అభిమానులు, సినిమాల కోసం చిరునవ్వుతో ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తావు. రేపు విడుదకాబోతున్న ‘శాకుంతలం’ చిత్రానికి నా శుభాకాంక్షలు. నీ సంకల్పం, లక్షలాది అభిమానుల ప్రేమ నిన్ను కాపాడుతుంది’’ అని విజయ్‌ లేఖలో రాశారు. దానిపై సమంత స్పందిస్తూ.. ‘‘ఏం చెప్పాలో అర్థంకావట్లేదు. ఇలాంటి ప్రేమ, ఆప్యాయతే అవసరం. థ్యాంక్‌ యు మై హీరో’’ అని విజయ్‌కు బదులిచ్చారు.

vijay

కాగా సమంత ‘శాకుంతలం’ హిందూ పురాణాల్లోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథ నేపథ్యంతో తెరకెక్కింది. మైథ‌లాజిక‌ల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రాన్ని గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్నాడు. మలయాళ నటుడు దేవ్ మోహన్, అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ముఖ్య పత్రాలు చేస్తుండగా.. మోహన్ బాబు, మధూ, గౌతమి, అధితి బాలన్ మరియు అనన్య నాగళ్ల తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here