Charan Tarak: ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలాగే వీళ్ళ స్నేహం బంధం కూడా బలపడింది. కానీ ఇప్పుడు ఆ స్నేహబంధం బీటలు వారుతున్నట్టు సోషల్ మీడియా కోడై కూస్తోంది. నిప్పు లేనిదే పొగ రాదన్నాట్టు .. వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందనడానికి కొన్ని సంఘటనలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి..
రామ్ చరణ్ మార్చి 27న తన ఇంట్లో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. చిరంజీవి, రామ్ చరణ్ ఆహ్వానం మేరకు చిత్ర పరిశ్రమ మొత్తం ఈ వేడుకకు హాజరైంది. దర్శకులు, నిర్మాతలు, హీరోలు అందరూ వచ్చారు. కానీ ఎన్టీఆర్ మాత్రం రాలేదు ఈ పార్టీలో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుక కోసమే కాకుండా ఆర్.ఆర్.ఆర్ టీం సన్మాన కార్యక్రమం కూడా చేశారు. ఆస్కార్ విన్నర్స్ కీరవాణి, చంద్రబోస్ లను కూడా చిరంజీవి దంపతులు సత్కరించారు. రామ్ చరణ్ బర్త్ డే కి జూనియర్ ఎన్టీఆర్ రావలసిన అవసరం ఉంది. కానీ రాకపోవడంతో వీళ్లిద్దరి మధ్యన మనస్పర్ధలే కారణమని అంతా అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ సడన్గా గురువారం డిన్నర్ పార్టీ ప్లాన్ చేశారు. తారక్ నివాసంలో జరిగిన ఈ పార్టీకి అతి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. మైత్రి మూవీ మేకర్స్, రాజమౌళితో పాటు మరి కొంతమంది సినీ పరిశ్రమ పెద్దలు వచ్చారు. చరణ్ పార్టీతో పోల్చితే ఎన్టీఆర్ పార్టీ అంత పెద్దది ఏమీ కాదు. పైగా ఇది ప్రైవేట్ పార్టీ అని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ పార్టీకి రామ్ చరణ్ హాజరు కాకపోవడం మరోసారి చర్చకు దారితీసింది. ఎన్టీఆర్ తన బర్త్డే పార్టీకి రాలేదని జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన పార్టీకి చరణ్ రాలేదనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ రెండు పరిణామాలను ఆధారం చేసుకుని వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని సోషల్ మీడియా రాయిళ్లు వార్తలు పుట్టిస్తున్నారు. ఇందులో నిజమెంతుంది అనేది వాళ్ళిద్దరికే తెలియాలి.