Telangana Sakuntala : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంత మంది నటీనటులు ఉన్న కొంతమంది నటీనటులు మాత్రం ఎన్ని తారలు మారిన ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసి ఉంటారు, అలాంటి అతి తక్కువ మంది నటీనటుల్లో ఒక్కరు తెలంగాణ శకుంతల,విలన్ గా , కమెడియన్ గా మరియు క్యారక్టర్ ఆఎర్టిస్టుగా ఈమె పోషించిన పాత్రలను అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు, తనకి ఏ పాత్ర ఇచ్చిన దానికి నూటికి నూరు పాళ్ళు న్యాయం చెయ్యడమే కాకుండా ఆ పాత్రలను తానూ తప్ప మరెవ్వరు చెయ్యలేరు అనే విధంగా శబాష్ అనిపించుకుంది.
ముఖ్యంగా తెలంగాణ మరియు రాయలసీమ మందలికల్ని ఈమె కంటే బాగా ఎవ్వరు ఉచ్చరించలేరు అనే చెప్పాలి, హీరో అయినా లేదా క్యారక్టర్ ఆర్టిస్టు అయినా తెలంగాణ యాస శకుంతల గారి ముందు మాట్లాడాల్సి వస్తే భయపడే వాళ్ళు, ఎందుకంటే ఆమె ముందు చాలా అలవోకగా తేలిపోగలము అనే భయం వల్లే, తెలంగాణ యాస అత్యద్భుతంగా మాట్లాడుతుంది కాబట్టే ఆమెకి తెలంగాణ శకుంతల అనే పేరు వచ్చింది, ఇది ఇలా ఉండగా తెలంగాణ శకుంతల గారి గురించి మీకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.
తెలంగాణ శాకుంతల గారు మహా రాష్ట్ర కి చెందిన మనిషి, ఆమె తండ్రి ఒక్క ఆర్మీ ఆఫీసర్, మహా రాష్ట్ర ప్రాంతానికి చెందిన ఆమె అయినా కూడా తెలుగులో అన్ని మాండలికాల్ని శకుంతల గారి లాగ ఎవ్వరు మాట్లాడలేరు అనే చెప్పాలి, దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు,ఆమెకి తెలుగు బాషా అంటే ఎంత అభిమానం అనేది,చిన్నప్పటి నుండి నటన మీద విపరీతమైన ఆసక్తి ఉన్న శకుంతల గారు హైదరాబాద్ లో ఎలా అయినా సినిమాల్లో అవకాశాలు సంపాదించాలి అనే ద్యేయంతో అడుగుపెట్టింది, అయితే ఆమె డైరెక్టుగా సినిమాల్లో అడుగుపెట్టకుండా తొలుత రవీంద్ర భారతి కళాక్షేత్రం లో నాటకాలు ఇవ్వడం ప్రారంబించింది,అలా ప్రముఖ దర్శకుడు గౌతమ్ గూస్ గారి దృష్టిలో పడింది,1979 వ సంవత్సరం లో ఆయన తీస్తున్న మన భూమి సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయినా శకుంతల గారు, ఆ తర్వాత ఎన్నో వందల సినిమాల్లో విలక్షణమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రని వేశారు, ముఖ్యంగా ఒక్కడు , నువ్వు నేను , ఒసేయ్ రాములమ్మ, లక్ష్మి మరియు వీడే వంటి సినిమాలు ఆమెకి అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టడమే కాకుండా అవార్డులు కూడా తెచ్చి పెట్టింది.
శకుంతల కి పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, అయితే ఇంట్లో సంపాదన మొత్తం ఈమె మీదనే ఆధారపడి ఉంది.ఆమె పిల్లలిద్దరూ పెళ్లి చేసుకునే వయస్సుకి వచ్చారు.భర్త కి పెద్ద ఉద్యోగం లేదు, పిల్లలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు ప్రస్తుతం.వాళ్లకి సంబంధించిన ఫోటో ఒకటి క్రింద ఎక్సక్లూసివ్ గా అందిస్తున్నాము చూడండి.ఇది ఇలా ఉండగా ఈమెకి తొలి నుండి గుండెకి సంబంధించి ఎప్పుడు ఎదో ఒక్క అనారోగ్యం వస్తూ ఉండేది, ఈమె ఆర్ధిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే, అప్పట్లో ఈమెకి ప్రముఖ నటి విజయ శాంతి ఆర్థికంగా చాలా సార్లు సహాయం చేసింది, విజయశాంతి ఒక్క సినిమాలో అప్పట్లో పూర్తి స్థాయి తెలంగాణ యాస మాట్లాడాల్సి రావడం తో అప్పుడు తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉన్న శకుంతల గారిని తన ఇంటికి పిలిపించుకొని ఆ బాషా ని నేర్చుకున్నారు అట.
అప్పటి నుండి విజయ శాంతి కి తెలంగాణ శకుంతల గారు అంటే మంచి అభిమానం ఉండేది, ఆమె అనారోగ్యం పాలైన ప్రతిసారి విజయశాంతి గారే ఆమెకి ఆర్థికంగా సహాయం చేసేవారు అట, ఈ విషయం ని స్వయంగా శకుంతల గారే పలు మార్లు చెప్పారు, కానీ శకుంతల గారి చివరి రోజుల్లో మందులకు కూడా డబ్బులు లేక చాలా ఇబ్బంది పడ్డారు, తానూ నోరు తెరిచి సాయం కోరితే ఇండస్ట్రీ నుండి సహాయం చేసే వాళ్ళు బాగానే ఉన్న కూడా శకుంతల గారు ఏ రోజు కూడా చెయ్యి చాచి ఒక్కరిని సహాయం కోరలేదు, విజయశాంతి గారు కూడా ఆమె అవసరాలని అర్థం చేసుకొని అడగకపోయినా సహాయం చేసేవారు, కానీ కాలం ఎప్పుడు ఒక్కేలా ఉండదు కదా, ఒక్క రోజు ఆమెకి తీవ్రమైన గుండెపోటు రావడం తో హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు, కానీ ఆమె అప్పటికే కన్ను మూసింది అని డాక్టర్లు నిర్ధారించారు, అలా 2014 వ సంవత్సరం లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక్క వజ్రం లాంటి నటి ని కోల్పోయింది.