Alekhya Reddy : సినీ నటుడు నందమూరి తారకరత్న అతి చిన్న వయస్సులోనే గుండె పోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఆయన చివరికి అందరిని వదిలేసి వెళ్లడం భాధాకరం.. నువ్వు లేవు అన్న వార్తలు విని తట్టుకోలేక పోతుంది ఆయన భార్య అలేఖ్య రెడ్డి..తారకరత్న మరణాన్ని అయన భార్య అలేఖ్య రెడ్డి మాత్రం ఊహించుకోలేకుంది.. ఎవరెన్ని అన్నా కూడా భరించి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త భౌతికంగా లేకపోవడంతో మానసికంగా మనవేదనకు గురవుతుంది… భర్తతో గడిపిన ప్రతి క్షణాలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తుంది.. వాటిని చూసిన అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.. దాంతో అవి వైరల్ అయ్యాయి.. తాజాగా మరో పోస్ట్ తో అందరిని ఏడ్పించేసింది..అది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..

తారకరత్న మరణం తర్వాత ఎన్నో పోస్టులు పెట్టింది.. తారకరత్న అంటే ఎంత ఇష్టమో వీటితో తెలుస్తుంది..అతి చిన్నవయస్సులో నే భర్త దూరంవ్వడం అలేఖ్య ను కలిచివేస్తుంది.. మనకు తెలుసు మనం ఎన్ని బాధలు, అవమానాలు పడ్డామో..నా జీవితంలో ని అంత ప్రేమగా చూసుకున్న వాళ్ళు లేరు.. నువ్వు లేవు అన్న మాట వింటే నా గుండె బరువెక్కుతుంది.. ఆ బాధను భరించలేకున్నా.. ఈరోజు నా చుట్టూ ఎంత మంది ఉన్న నువ్వు లేని లోటును ఎవరూ తీర్చలేరు.. మన పిల్లలకోసం నేను ఇక్కడ ఉన్నాను.. ఐ మిస్ యు.. ఐ లవ్ యు.. నిన్ను మేము మిస్ అవుతున్నాము నాన్న అంటూ పోస్ట్ చేసింది..అది చూసిన తారక రత్న ఫ్యాన్స్ నందమూరి కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ గుండె ధైర్యం చేసుకోవాలని చెబుతున్నారు..

ఇప్పుడు మరో పోస్ట్ ను పెట్టింది..తారకరత్న చనిపోయి సుమారు 2నెలలు కావొస్తున్నా ఇంకా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. భర్తను కోల్పోయిన అలేఖ్యా రెడ్డి తారకతరత్నను తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది.తాజాగా మరోసారి భర్తను తలుచుకుంటూ అలేఖ్యారెడ్డి ఎమోషనల్ అయ్యింది. పిల్లలతో తారకరత్న గడిపిన క్యూట్ మూమెంట్స్‌ను షేర్ చేస్తూ.. నిన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోకుండా ఉండలేకపోతున్నా అంటూ ఇన్‌స్టాలో పంచుకుంది. ఇది చూసిన నెటిజన్లు.. మాకే చాలా బాధగా అనిపిస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు… ప్రస్తుతం ఆమె మరో కొత్త బిజినెస్ ను మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. ఏం బిజినెస్ చేస్తుందో త్వరలోనే తెలియనుంది..