Pavitra Naresh : మళ్ళీ పెళ్లితో జనాల్ని బకరాలు చేస్తున్న నరేష్ పవిత్ర..

- Advertisement -

Pavitra Naresh : నరేష్ పవిత్ర విడివిడిగా వీళ్ళ పేర్లుకంటే పలికే కంటే జంటగా పలికితేనే ఈ జంటకి ముచ్చటగా ఉంటుందేమో.. ఆ ముచ్చట తీర్చుకోవాలని అనుకుంటున్నారు లేదంటే మళ్లీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారో తెలియదు కానీ.. పోనీ పెళ్లి చేసుకుంటారా అంటే.. అది లేదు.. అదిగో.. ఇదిగో అంటూ.. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు.. సరే కదా అని పెళ్లి చేసుకుంటారు అని అనుకునే లోగా తూచ్ ఇదంతా సినిమా.. ఆ ప్రమోషన్ లో భాగం అంటూ జనాల్ని వెర్రోల్ని చేస్తున్నారు ఈ జంట మళ్ళీ పెళ్లి తో.. గా.. ముచ్చాటెందో చూద్దాం రండి..

Pavitra Naresh
Pavitra Naresh

నరేష్ నాలుగో పెళ్లి, పవిత్ర రెండో పెళ్లి వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారని వార్త గత కొన్నారుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. నరేష్ పవిత్ర ఓ రెస్టారెంట్ లో ఉండగా.. నరేష్ మూడో భార్య రమ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మీడియా ముందుకు తీసుకొచ్చింది. అయినా కానీ వీళ్ళిద్దరూ మేం ఫ్రెండ్స్ అంటూ కొట్టి పారేశారు. త్వరలోనే రమ్యకు విడాకులు ఇచ్చేసి నరేష్ పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నాడని అందరూ అనుకుంటున్నారు.. ఆ అడ్వాంటేజ్ ను ఆయుధంగా మలచుకుని మళ్ళీ పెళ్లి అనే వీడియోతో నరేష్ పవిత్ర ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోబోతున్న వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. ఆ వీడియో ఇటీవల వైరల్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే..

సరే వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు కదా అని ముచ్చట అక్కడితో ఆగిపోయింది అనుకుంటే పొరపాటే. అది సినిమా తీయడానికి టైటిల్ అని కొందరు అంటుంటే.. యే లేదు లేదు.. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని మరికొంతమంది అనుకున్నారు. మొత్తానికి అది సినిమా టైటిల్ అని త్వరలోనే ఆ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నామని ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. దాంతో నరేష్ పవిత్ర వాళ్ళ మళ్ళీ పెళ్లి అనే కాన్సెప్ట్ తో పూర్తిగా బాకరాలను చేశారు. ఇక ఇంకో నాలుగు రోజుల్లో ఈ సినిమా టీజర్ వస్తుంది. అందులో వీళ్ళిద్దరూ మళ్ళీ పెళ్ళి చేసుకుంటారా.. లేదంటే వీళ్లే ఎవరికైనా మళ్ళీ పెళ్ళి చేస్తారా అనేది చూడాలి. మొత్తానికి వాళ్ళ మళ్ళీ పెళ్లి అనే కాన్సెప్ట్ తో కావల్సినంత ప్రమోషన్ అయితే చేసుకున్నారు అనేది వాస్తవం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here