తెలుగు సినిమాల గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన పని లేదు..అద్భుతమైన సంగీతం తో పాటుగా ఊహాలోకంలో విహరించే లా చేసే గాత్రం ఇవన్నీ కూడా సినిమా హిట్ అవ్వడానికి కారణం అవుతాయి. సినిమా హిట్ అయిన లేక ప్లాప్ అయిన కూడా సంగీతం బాగుంటే సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోందని చెప్పాలి. తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన రొమాంటిక్ Telugu Video Songs గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పుడు తెలుగులో వస్తున్న సినిమాలన్నీ కూడా లవ్ , రొమాంటిక్ జోనర్ లో వస్తున్నాయి. వాటిలోని సాంగ్స్ యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. లిప్ లాక్ ఎక్కువగా ఉండటం వల్ల సాంగ్స్ బాగా పాపులర్ అవుతున్నాయి. ఇక లిప్ లాక్ లతో పిచ్చెక్కిస్తున్న సాంగ్స్ ను ఆలస్యం చెయ్యకుండా చుద్దాము..
అర్జున్ రెడ్డి : రొమాంటిక్ హీరో విజయ్ దేవరకొండ, షాలిని నటించిన ఈ సినిమా సినీ చరిత్రనే మార్చేసింది.అప్పటి వరకు ఓ మాదిరిగా రొమాంటిక్ కథలతో వస్తున్న సినిమాలు ఈ సినిమా దెబ్బకు షాక్ అయ్యాయి.ఈ సినిమాలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సాంగ్ మదురమే.. ఈ సినిమా వచ్చి చాలా ఏళ్ళు అయిన కూడా ఇప్పటికీ సాంగ్ వినిపిస్తోంది..మీరు ఓ సారి ఇటు లుక్ వేసుకోండి..
బిజినెస్ మేన్: మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ నటించిన ఈ సినిమా లో కథ అంతగా ఆకట్టుకోలేక పోయింది.. అయితే సాంగ్స్ పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందులోని చందమామ సాంగ్ ప్రేక్షకులకు నిద్ర లేకుండా చేసింది. ఎన్ని లిప్ లాక్ లు ఉన్నాయో.. ఆ సాంగ్ ఇప్పుడు మరో సారి చూసేయండి..ఈ సినిమా తర్వాత లిప్ లాక్ లు వద్దని అతని భార్య చెప్పిందని టాక్..
ఆరెక్స్ 100 : ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సినిమాలో చూపించిన సన్నివేశాలు యువతను ఆలోచనలో పడేశాయి. ఈ సినిమాలోని అన్నీ పాటలు ఆహా అనిపించాయి. ముఖ్యంగా పిల్లారా సాంగ్ లో హీరో, హీరోయిన్లు లిప్ లాక్ తో రొమాన్స్ లో మునిగి తేలారు. మీరు ఒకసారి చూడండి…ఈ సినిమా తర్వాత హీరో హీరోయిన్లకు పెద్దగా ఫెమ్ రాలేదని తెలుస్తుంది..
ఇవే కాదు చాలా సాంగ్స్ ఉన్నాయి.. ఇకపోతే ప్రస్తుతం వస్తున్న సినిమాలు కూడా బోల్డ్ కంటెంట్ తో వస్తున్నాయి.. చూసిన సినిమా లాగా ఉండటంతో యువత పెద్దగా ఆసక్తి చూపించలేదు..దాంతో సినిమా వచ్చిన వారంలోనే ప్యాకప్ చెప్పేస్తున్నారు..ఏంటో ఈ జనాలు..