Pawan Kalyan ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్.. అకిరా నా కొడుకు అంటూ సంచలన వ్యాఖ్యలు..

- Advertisement -

Pawan Kalyan మాజీ భార్య రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు నిత్యం ఏదో వాగ్వాదం జరుగుతూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ ఒక్కోసారి హద్దులు దాటుతుంటారు.. ఆ సమయంలో సహనం ఆమె కోల్పోతుంది.. ఇక నోటికి వచ్చినట్లు అంటుంది.. గతంలో చాలా సార్లు ఇలాంటి గొడవలు జరిగాయి..ఇప్పుడు మరోసారి రేణుదేశాయ్ పవన్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తుంది..తాజాగా అకిరా నందన్ బర్త్ డే సందర్భంగా ఓ అభిమాని చేసిన కామెంట్‌కు రేణూ దేశాయ్ ఇలా స్పందించింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం..

Pawan Kalyan
Pawan Kalyan

మేడం ఇది చాలా అన్యాయం.. మా అకిరాను ఒకసారి అయినా చూపించండి.. మా అన్న కొడుకుని చూడాలని ఉంటుంది మాకు.. మీరు ఇలా హైడ్ చేయకండి.. అప్పుడప్పుడు అయినా వీడియోలో అకిరా బాబుని చూపించండి అని ఓ పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్ రేణూ దేశాయ్‌ని రిక్వెస్ట్ చేశాడు. కానీ రేణూ దేశాయ్‌కి ఈ కామెంట్ చూసి మండి పోయినట్టుంది.మీ అన్న కొడుకు?.. అకిరా నా కొడుకు .. మీరు ఒక తల్లికి పుట్టలేదా?.. మీరు ఆయనకు వీరాభిమానులు అని నేను అర్థం చేసుకుంటాను.. పద్దతిగా మాట్లాడటం నేర్చుకోండి.. ఇలాంటి మెసెజ్‌లను నేను పట్టించుకోవడం మానేశాను.. మీరు హద్దులు మీరి ఇలా మాట్లాడుతున్నారు అంటూ ఫ్యాన్‌ను నిలదీసింది.

ఈ రోజు నా కొడుకు బర్త్ డే.. ఈ రోజు ఇలాంటి కామెంట్లు చూస్తుండటం నాకు బాధగా ఉంది.. అంటూ రేణూ దేశాయ్ ఎమోషనల్ అయింది.ఇక చివరకు అకిరా నందన్ బర్త్ డే సందర్భంగా అయితే రేణూ దేశాయ్ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తన కొడుక్కి 19 ఏళ్లు వచ్చాయని చెప్పింది.. చెట్టంత ఎదిగినా కూడా తల్లికి కొడుకే అని.. ఇంకా అకిరా నా ఒళ్లో సరిగ్గా సరిపోతోన్నాడు అంటూ తన కొడుకు మీద ప్రేమను కురిపించింది రేణూ దేశాయ్.ఇక అకిరా నందన్ సినీ ఎంట్రీ కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. జూ. పవర్ స్టార్ అనే ట్యాగ్‌ను ఎప్పుడో అకిరాకు ఇచ్చేశారు. అయితే అకిరా హైట్, లుక్స్‌కి టాలీవుడ్‌ ఫిదా అవుతుందని, ఒక్క సినిమా పడితే అన్నీ మారిపోతాయ్ అని పవర్ స్టార్ ఫ్యాన్స్ సంబరపడుతుంటారు…ఈ ఏడాదిలో ఓ సినిమాలో చెయ్యనున్నాడనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here