Janhvi Kapoor గురించి అందరికి తెలుసు..శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీకి పరిచమైంది.. మొదటి సినిమాతోనే సక్సెస్ టాక్ ను అందుకుంది..ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసిన కూడా పెద్దగా హిట్ అవ్వలేదు..వరస సినిమాలు చేస్తోంది. కానీ అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. దీంతో ఈ బ్యూటీ సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాలని తహతహలాడుతోంది. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అద్భుత అవకాశాన్ని కొట్టేసింది.. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న అమ్మడు, ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతూ కెమెరాలకు పోజులుస్తుంది.. ఆ ఫోటోలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే..

ఇకపోతే ఇప్పుడు రష్మిక గురించి మరో వార్త సంచలనాలకు దారి తీస్తుంది.. తాజాగా కూడా శిఖర్ తో కలిసి తిరుమలలో దర్శనమిచ్చింది. ప్రియుడితో ప్రత్యేక పూజాలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీంతో వీరిద్దరి ప్రేమను జాన్వీ తండ్రి బోనీ కపూర్ ఒప్పుకున్నారని.. శిఖర్ ఫ్యామిలీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జంటగా శ్రీవారిని దర్శించుకున్నారని వార్తలు ఊపందుకున్నాయి. అంతేకాదు, జాన్వీ-శిఖర్ త్వరలోనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల పట్ల జాన్వీ కపూర్ అభిమానులు ఎంతగానో ఆందోళన చెందుతున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చి ఐదేళ్లు అవుతున్నా ఇంతవరకు కెరీర్ ఊపందుకోలేదు. ఇక పెళ్లి చేసుకుంటే జాన్వీని పట్టించుకునే నాధుడే ఉండడు.

ఈ విషయం తెలిసి కూడా జాన్వీ పెళ్లి వైపు మొగ్గు చూపితే పెద్ద తప్పు చేసినట్లే.. అసలే బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ అమ్మడును పట్టించుకోలేదు.. ఇక పెళ్లి అయితే ఎవరు చూడరు కూడా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు… ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో కోడై కూస్తుంది.. దీనికి అమ్మడు ఏం చెబుతుందో చూడాలి..ఇక ఎన్టీఆర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ సైతం స్టార్ట్ అయింది. ఈ మూవీతో జాన్వీ దశ తిరిగిపోతుంది.. ఎన్టీఆర్ 30 తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ఫుల్ బిజీగా మారుతుందని అభిమానులు ఆశపడుతున్నారు..