Dasara Collections : ఈమధ్య కాలం లో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమాలు ఆంధ్ర ప్రదేశ్ లో సరిగా ఆడడం లేదు.ఎంత మంచి కంటెంట్ తో వచ్చినా పర్వాలేదు అనే రేంజ్ లోనే ఆడుతున్నాయి.చిన్న సినిమా గా విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన తెలంగాణ బ్యాక్ డ్రాప్ సినిమా ‘బలగం’ కూడా ఆంధ్ర ప్రదేశ్ లో రాబట్టిన వసూళ్లు అంతంత మాత్రమే.ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’ చిత్రం పరిస్థితి కూడా ఇదే.
మొదటి రోజు మొదటి ఆట నుండే అద్భుతమైన టాక్ ని తెచ్చుకుంది.కానీ ఆంధ్ర ప్రదేశ్ లో కలెక్షన్స్ మాత్రం రోజు రోజుకి తగ్గు ముఖం పడుతున్నాయి,కానీ తెలంగాణ లో మాత్రం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తుంది దసరా.కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా 14 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది తెలంగాణ ప్రాంతంలో.
అక్కడి ఆడియన్స్ తెగ నచ్చేసిన ఈ సినిమా ఇక్కడ మాత్రం ఎందుకు పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లకే పరిమితం అయ్యింది అనే విశ్లేషణ ప్రారంభిస్తే తెలంగాణ మాండలికం, తెలంగాణ యాస ఆంధ్ర ఆడియన్స్ కి అర్థం కాకపోవడం వల్లే అని అంటున్నారు.ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి సుమారుగా 50 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
కేవలం మూడు రోజుల్లోనే దాదాపుగా 40 రూపాయిల మార్కుకి దగ్గరగా న్యాచురల్ స్టార్ నాని వచ్చిన సినిమా, మొదటి వారం లోపే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.ఇదే ఫ్లో కొనసాగిస్తూ ముందుకు దూసుకు పోతే ఫుల్ రన్ లో 70 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు.కానీ ఆంధ్ర ప్రదేశ్ లో కచ్చితంగా సోమవారం నుండి డీసెంట్ స్థాయి వసూళ్లు ఉండాలి, కుప్పకూలిపోతే మాత్రం 60 కోట్ల రూపాయలకే క్లోసింగ్ పడిపోతుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.