Ram Charan సినీ నటుల గురించి ఎప్పుడూ ఏదొక వార్త వైరల్ అవుతూ వస్తుంది.. ముఖ్యంగా వాళ్ళు వేసుకొనే డ్రెస్సులు, బ్యాగ్, చెప్పులతో పాటు ఇతర వస్తువులు కూడా అందరిని ఆకట్టుకుంటాయి.. ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ ల గురించి ఎన్నో ఆసక్తి కర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. వీరిద్దరూ ఇప్పుడు టాక్ అఫ్ టాలివుడ్ అయ్యారు.. ట్రిపుల్ ఆర్ సినిమా తో గ్లోబల్ స్టార్స్ అయ్యారు.. రామ్ చరణ్ అయితే ఇంటరనేషనల్ లెవల్ లో ఫెమస్ అవుతున్నాడు..తన గురించి తన భార్య ఉపాసనా ధరించిన వస్తువులు ఓ రేంజులో ఉండటంతో అందరూ తెగ వార్తల్లో నిలిచారు..
ఇప్పుడు చెర్రి పెట్టుకున్న కళ్ళజోడు ధర అందరికి షాక్ ఇస్తుంది..లక్షకు పైగానే ఉంటుందని చెబుతున్నారు.. ఇక ఆ కళ్ల జోడు ప్రత్యేకతల పై ఒక లుక్ వేద్దాం రండి.. ఇకపోతే చరణ్ ఓ ఫ్యాషన్ ఐకాన్ కూడా. ఆఫ్ స్క్రీన్ కూడా తన ఫ్యాషనబుల్ అప్పియరెన్స్‌తో వావ్ అనిపిస్తాడు. కాగా ఇటీవల హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భార్య ఉపాసన, పెట్ డాగ్ రైమ్‌తో చాలా క్లాసీ లుక్‌లో కనిపించాడు చరణ్. ఇక్కడ రామ్ చరణ్ పెట్టుకున్న డియోర్ కళ్ళజోడుపై చాలామంది ఫోకస్ పడింది.. ఇప్పుడు దాని ధర ఎంతో తెలసుకోవాలని ఆరాటపడతారని వెయిట్ చేస్తున్నారు కదూ…. ఫ్యాషన్ ఇండస్ట్రీలో లగ్జరీ కళ్లజోడు బాగా ఫేమస్ అయ్యిర ఈ డియోర్ స్పెట్స్ ధర.. అక్షరాలా లక్షా నలభై నాలుగు వేలు.
డియోర్ అనేది ఒక ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్. సెలబ్రిటీలు ఎక్కువగా డియోర్ కళ్లద్దాలు ధరించి కనిపిస్తారు. రామ్ చరణ్ తాజా ఎయిర్పోర్ట్ లుక్ చూసి అతని లేడీ ఫ్యాన్స్ వావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రజంట్ రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ అనే మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాతి జెర్సీ మూవీ తీసిన గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేయనున్నాడు.. మరోవైపు యాడ్ లు కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు.. ఎంత బిజీగా ఉన్నా భార్య లేకుండా ఏ ఫంక్షన్, పార్టీకి కూడా వెళ్ళడు.. ప్రస్తుతం భార్యతో వేకేషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.