Nadhiya: చిన్న వయసులోనే లవ్ ఎఫైర్ పెట్టుకున్న పవన్ కళ్యాణ్ అత్త.. ఎవరితోనో తెలుసా.?

- Advertisement -

Nadhiya : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఓ ప్రవాహం లాంటిది. అందులో ఓ భాషలో గుర్తింపు పొందిన నటి నటులు మరికొన్ని భాషల చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించి తన నటనతో పాటు అందం, అభినయంతో కూడా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది నదియా.. ఆ తరువాత అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ కు అత్తగా నటించిన నదియా ఏకంగా తన నటనకి అవార్డులను సైతం అందుకుంది.. పవన్ కళ్యాణ్ అత్తగా నటించిన నదియాకి ఓ లవ్ స్టోరీ ఉందట.. ఆ విషయాన్ని తానే స్వయంగా చెప్పడం విశేషం. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Nadhiya

నదియా ఇంటర్ చదువుతున్న సమయంలోనే తన ఇంటి ఎదురుగా ఉన్న శిరీష్ గాడ్ బోలే పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందట. రాను రాను ఆ ప్రేమ మరింత ఎక్కువైందట ఇక ఒకరోజు నువ్వు లేకుంటే నేను లేను అని నదియా నే అతనితో చెప్పగా తను సున్నితంగా తిరస్కరించాడట ఎందుకంటే అప్పటివరకు తనకి చదువు తప్ప మరో వాటిపై ధ్యాస లేదట తను మంచిగా చదువుకొని అమెరికా షెడ్యూల్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడట. ఇక తను అనుకున్నట్టుగానే బాగా చదివి అమెరికాలో సెటిల్ అయ్యాడట అమెరికా వెళ్లిపోవడంతో నదియ కూడా సినీ కెరియర్ పై కాన్సన్ట్రేషన్ చేసింది..

శిరీష్ అమెరికా వెళ్ళిపోయిన తర్వాత స్టార్ హీరోయిన్ గా రాణించింది. నదియా మంచి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. ఇక పెద్దలను ఒప్పించే శిరీష్ నదియా పెళ్లి చేసుకున్నారు. 1988లో వీరి పెళ్లి జరగగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పెద్దయ్యాక కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా నదియా తన సత్తా చాటితోంది. ప్రభాస్, సమంతకి తల్లిగా నటించి పవన్ కళ్యాణ్ కు అత్తగా నటించి మెప్పిచింది.

- Advertisement -

ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి.. అదేంటంటే ఇప్పుడు తల్లిగా , కొత్తగా నటిస్తున్న నదియా ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా నటించిందని మనలో కొద్ది మందికి మాత్రమే తెలుసు. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు నటించిన బజారు రౌడీ సినిమాలో హీరోయిన్ గా చేసి తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఆమె డ్యూయల్ రోల్ చేసి ఆకట్టుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here