Dasara Movie : దుమ్ము లేపిన ‘దసరా’ ఓపెనింగ్స్.. 50 కోట్లు పెట్టి తీస్తే మొదటి రోజు వచ్చిన వసూళ్లు ఇవే!

- Advertisement -

Dasara Movie : న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’ చిత్రం నిన్న భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ ని రాబట్టిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకి వచ్చిన ఓపెనింగ్స్ ని చూసి ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెట్టారు.ప్రతీ ప్రాంతం లో మీడియం రేంజ్ హీరోల సినిమాలలో ఆల్ టైం రికార్డులను నెలకొల్పిన ఈ సినిమా, కొన్ని ప్రాంతాలలో స్టార్ హీరోలకంటే ఎక్కువ ఓపెనింగ్స్ ని తెచ్చుకుంది.

Dasara Movie

ముఖ్యంగా నైజాం ప్రాంతం గురించి చెప్పుకోవాలి.ఈ ప్రాంతం లో అడ్వాన్స్ బుకింగ్స్ లోనే నాలుగు కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది.సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ కంటే ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ ని జరుపుకున్న ఈ చిత్రం నైజాం ప్రాంతం లో 7 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టనుంది.

నైజం తర్వాత ఈ సినిమా కి దుమ్ము లేచిపొయ్యే ఓపెనింగ్ ఇచ్చిన ప్రాంతం ఉత్తరాంధ్ర.ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ ప్రాంతం లో మొదటి రోజు దాదాపుగా కోటి 80 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసిందని చెప్తున్నారు.ఇది మీడియం రేంజ్ హీరోల సినిమాలలో ఆల్ టైం రికార్డు అట.ఇక గుంటూరు జిల్లాలో ఈ చిత్రానికి కోటి 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి, GST కలిపితే కోటి 25 లక్షల రూపాయిల వరకు షేర్ ఉంటుందని అంచనా.

- Advertisement -

మిగిలిన అన్నీ ప్రాంతాలలో కూడా స్టార్ హీరో రేంజ్ వసూళ్లనే రాబట్టింది.కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమా 14 కోట్ల రూపాయిల షేర్ వచ్చినట్టు తెలుస్తుంది.ఇక అమెరికా లో ఈ చిత్రానికి కేవలం ప్రీమియర్ షోస్ నుండే ఆరు లక్షల రూపాయిలు డాలర్లు వచ్చిందట.ఈ రేంజ్ వసూళ్లు మీడియం రేంజ్ హీరో కి రావాలంటే చాలా కష్టం అనే చెప్పాలి.అలా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు సుమారుగా 20 కోట్ల రూపాయలకు దగ్గరగా షేర్ వసూళ్లు సాధించినట్టు సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here