బాలివుడ్ హీరోయిన్ Janhvi Kapoor గురించి ఎంత చెప్పిన తక్కువే.. మొదటి సినిమాతో మంచి క్రేజ్ ను అందుకుంది.. ఇక బాలివుడ్ లో పెద్దగా సినిమాలు చెయ్యలేదు కానీ, సోషల్ మీడియాలో ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. చేసింది కొద్ది సినిమాలే అయిన క్రేజీ ఆఫర్ ను తెలుగులో కొట్టేసింది..ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తున్నారు. నిజానికి ఆమె ట్రాక్ రికార్డుకి ఈ సినిమాలో ఆఫర్ రాదు. స్టార్ హీరోల పక్కన ఎస్టాబ్లిష్ అయిన కమర్షియల్ హీరోయిన్స్ కి మాత్రమే ఛాన్స్ దక్కుతుంది. ఆమె కేవలం శ్రీదేవి కూతురన్న కారణంగా దర్శకుడు కొరటాల శివ ఈ చిత్ర హీరోయిన్ గా ఎంపిక చేశారు.. అమ్మడు ఎప్పుడూ శరీరాన్ని ఫిట్ గా ఉంచడానికి చూస్తుంది..తాజాగా జిమ్ లో వర్కౌట్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది..ఆ వీడియోను చూస్తే యూత్ కు మెంటలెక్కడం ఖాయం..
శ్రీదేవిది ఎవర్ గ్రీన్ ఫేమ్ అండ్ ఇమేజ్. అందుకే ఆమె కూతురు జాన్వీ కపూర్ ని సౌత్ పరిశ్రమకు తేవాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. ఏవీ కార్యరూపం దాల్చలేదు. అసలు జాన్వీకి సౌత్ చిత్రాల్లో నటించాలనే ఆసక్తి లేదు. అందుకే మేకర్స్ ప్రపోజల్స్ ఆమె తిరస్కరించారనే ప్రచారం జరిగింది. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు. ఆ మధ్య మిల్లీ చిత్ర ప్రమోషన్స్ కోసం జాన్వీ హైదరాబాద్ వచ్చారు. ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ వస్తే అసలు వదులుకోరు.2018లో విడుదలైన ధడక్ మూవీతో జాన్వీ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. అయితే ఈ మూవీ విడుదలకు ముందే శ్రీదేవి ప్రమాదంలో కన్నుమూశారు. కూతురు జాన్వీని సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలన్న కల నెరవేరకుండానే ఆమె లోకాన్ని విడిచారు. పరిశ్రమకు వచ్చి ఐదేళ్లు అవుతున్నా ఆమెకు బ్రేక్ రాలేదు. కమర్షియల్ హీరోయిన్ గా ఎదగలేదు. ప్రయోగాత్మక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు..
మొదటిసారి ఎన్టీఆర్ వంటి బిగ్గెస్ట్ స్టార్ పక్కన ఛాన్స్ వచ్చింది. ఇక జాన్వీ హాట్ ఫోటో షూట్స్ కి పెట్టింది పేరు. జాన్వీని ఇంస్టాగ్రామ్ లో 21 మిలియన్స్ ఫాలో అవుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె క్రేజ్ ఏపాటిదో. కెరీర్లో ఒక్క బ్లాక్ బస్టర్ మూవీ లేకపోయినా గ్లామర్ తో అభిమాన గణాన్ని సంపాదించింది. జాన్వీ అందాలు చూస్తే ఎవడికైనా మతిపోవాల్సిందే. పర్ఫెక్ట్ ఫిట్ బాడీ సాధించేందుకు చాలా కష్టపడుతుంది. జాన్వీ కపూర్ ఒకసారి తన జిమ్ వీడియో షేర్ చేశారు. కఠిన కసరత్తులతో చెమటలు పట్టిస్తున్న ఆమెను చూస్తే కుర్రాళ్లకు నిద్ర కూడా పట్టదు.. ఇక ఆలస్యం ఎందుకు ఓ లుక్ వేసుకోండి..