Tamannaah : సినిమాల్లో నటించాలంటే కొన్ని వదులుకోవాలి.. మరికొన్ని భరించాలి. ఎంత కష్టమైనా పాత్ర అయినా సరే అందులో నటించి తీరాలి.అలా అయితేనే మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అయితే గతంలో స్టార్ హీరోయిన్ తమన్నా ఆ స్టార్ హీరోల సరసన నటించేటప్పుడు వారి భార్యలకు చాలా భయపడేదట.. అసలు ఎందుకు అలా అనేది మాత్రం తెలియదు.. మరి దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తమన్నా ఎందరో స్టార్ హీరోల సరసన నటించింది.. ఎంతోమంది అగ్ర నటుల సరసన నటించింది. ఇక తమన్నా ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన మూవీ ఊసరవెల్లి.అయితే ఈ సినిమా లో నటించే టైంలో అప్పుడే ఎన్టీఆర్ కి కొత్తగా పెళ్లయింది. ఇక మొదట్లో ఎన్టీఆర్ తో కలిసి లక్ష్మీ ప్రణతి కూడా ఆ సినిమా షూటింగ్ కి వచ్చేదట. ఆ టైంలో ఎన్టీఆర్ కి తమన్నా కి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు వచ్చిన టైంలో లక్ష్మి ప్రణతి తమన్న ని చాలా సీరియస్ లుక్ లో చూసేదట.. దాంతో తమన్నా పెద్దగా వారిని చూసేది కాదని చెప్పింది..అలాగే తమన్నా అల్లు అర్జున్ కాంబినేషన్లో బద్రీనాథ్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో కూడా అల్లు అర్జున్ కి అప్పుడే పెళ్లి అయింది.
ఇక ఆ షూటింగ్ కి తనతో పాటు స్నేహారెడ్డిని కూడా అల్లు అర్జున్ తీసుకోచ్చేవాడట.ఇక ఆ సినిమాలో నటించే టైంలో కూడా తమన్నా అల్లు అర్జున్ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించినప్పుడు స్నేహ రెడ్డి చాలా కోపంగా చూసేదట. అంతేకాదు అప్పుడే పెళ్లవ్వడంతో తన భర్త వేరే అమ్మాయితో అలా చేయడం ఏ అమ్మాయి కూడా సహించదు కదా. కానీ సినిమా ఇండస్ట్రీ అన్నాక ఇవన్నీ కామన్.ఇలా ఆ ఇద్దరు స్టార్ హీరోల భార్యలకు తమన్నా చాలా భయపడేదని గతంలో ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది.. ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందేమో.. అందుకే భయపడుతుందేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు..ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది…