Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఛలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అది తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఇప్పుడు అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిన ఈమె అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప సీక్వెల్లో కూడా నటిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే పక్క పాన్ ఇండియా స్టార్ అయిపోతుంది రష్మిక.

మరొకవైపు బాలీవుడ్ హంగామా ఈవెంట్ లో కూడా సందడి చేసి తన లుక్కులో పూర్తిగా మార్చేసింది అది చూసిన కొంతమంది మేకప్ మహిమ అంటే. లేదు సర్జరీ చేయించుకుంది అంటూ కూడా కామెంట్లు చేశారు
ఇదిలా ఉండగా తాజాగా ఖజానా జ్యువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

అందులో భాగంగానే నార్త్ ఖజానా స్టోర్లను సందర్శించినట్లు తెలుస్తోంది. ఆమె తన ఇన్స్టా స్టోరీస్ లో రెడ్ కలర్ డ్రెస్ లో చాలా అందంగా ఫ్లైట్లో కూర్చున్న ఫోటోను షేర్ చేస్తూ మీతో ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ మంచి అనుభూతి కలిగింది..
ప్రయాగ్ రాజ్ నుంచి గోరఖ్ పూర్.. గోరఖ్ పూర్ నుంచి ఇప్పుడు అక్కడినుంచి నా హోం టౌన్ హైదరాబాద్ కి చేరుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది నాకు అద్భుతమైన టైంలో కల్పించినందుకు ధన్యవాదాలు అంటూ ఫ్యాషన్ వీక్ లో భాగంగా తన ఆనందాన్ని వెల్లడించింది రెడ్ లెహంగాలో చాలా అద్భుతంగా కనిపించింది రష్మిక.