ఈ ‘షాపింగ్ మాల్’ యాడ్స్ ఏందీ బాసూ..! Meher Ramesh కి బుర్ర చెడిపోయిందా?

- Advertisement -

Meher Ramesh ‘వాల్తేరు వీరయ్య’ వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చిరంజీవి చేస్తున్న చిత్రం ‘భోళా శంకర్’.ఈ సినిమాకి డైరెక్టర్ మెహర్ రమేష్ అనే సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ తో డీలాపడిన మెహర్ రమేష్ ని చూసి మీడియం రేంజ్ హీరోలు కూడా బయపడి పారిపోతున్నారు.అలాంటిది చిరంజీవి లాంటి సూపర్ స్టార్ పిలిచి మరి అవకాశం ఇస్తే ఎంత డెడికేషన్ తో పని చెయ్యాలి..?.

Meher Ramesh
Meher Ramesh

కానీ మెహర్ రమేష్ పని తీరు చూస్తూ ఉంటే, ఈసారి చిరంజీవి దురాభిమానుల పండుగ చేసుకునే సినిమా ఇస్తున్నాడు అనే విషయం అర్థం అయిపోతుంది.ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రతీ పోస్టర్ నాసిరకానికి పరాకాష్ట లాగ ఉంది.చిరంజీవి ఈ సినిమా కోసం మంచి లుక్స్ ని మైంటైన్ చేసాడు, కానీ ఆ లుక్స్ ని వాడుకోవడం లో మెహర్ రమేష్ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యాడు.

Ramesh

ఇక రేపు ఉగాది కారణంగా ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు.పెళ్లి కి వేసిన కుర్చీ లో తమన్నా మరియు కీర్తి సురేష్ కూర్చోగా, వెనుక చిరంజీవి నిలబడతాడు.ఈ పోస్టర్ ని చూసిన ప్రతీ ఒక్కరికి CMR షాపింగ్ మాల్ ప్రకటన గుర్తుకొచ్చింది.సరిగ్గా అక్కడ ఉండే డిజైన్స్ ని ఈ సినిమా కోసం పోస్టర్స్ కోసం వాడారు.

- Advertisement -
bholashankar

అభిమానులు అయితే ఈ పోస్టర్ ని చూసి మెహర్ రమేష్ ని తిట్టిన తిట్లు వాళ్ళ జీవితకాలం లో ఎవరినీ కూడా తిట్టి ఉండరు.ఇండస్ట్రీ ని షేక్ చేసిన సినిమా తర్వాత ఘోరమైన పరాభవం ని ఎదురుకోబోతున్నామా అని ఫ్యాన్స్ ఇప్పటి నుండే బాధపడడం ప్రారంభించారు.ఆగస్టు 11 వ తేదీన ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయబోతున్నారట.మరి మెహర్ రమేష్ ఎప్పటిలాగానే నిరాశపరుస్తాడా, లేదా అభిమానులకు ఒక మంచి సినిమా తీసి బహుమతిగా ఇస్తాడా అనేది చూడాలి.

chiru
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here