Salaar : KGF సిరీస్ తో పాన్ ఇండియన్ లెవెల్ లో బాక్స్ ఆఫీస్ తో చెడుగుడు ఆదుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్, తన తదుపరి చిత్రం ప్రభాస్ తో ‘సలార్’ అనే చిత్రాన్ని గత ఏడాది కాలం నుండి చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ఇప్పటి వరకు టాకీ పార్ట్ మొత్తం 90 శాతం పూర్తి అయ్యిందట.మిగిలిన షూటింగ్ ఇటలీ లో చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది.
శృతి హాస్సన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా, మలయాళం టాప్ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు.ఈయనకి తండ్రిగా మన జగపతి బాబు నటిస్తున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నిట్లో ఈ చిత్రానికి ఎక్కువ క్రేజ్ ఉంది.ఇప్పటికే చాలా ప్రాంతాలలో రికార్డు స్థాయి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రైట్స్ అమ్ముడుపోయాయట.ఈ ఏడాది సెప్టెంబర్ 22 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ బయటకి వచ్చింది.
ఇక అసలు విషయానికి వస్తే సలార్ చిత్రం ఇక నుండి పాన్ ఇండియా కాదట, పాన్ వరల్డ్ సినిమా అట.ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి ఇంగ్లీష్ డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభం అయ్యాయట.సెప్టెంబర్ 22 వ తారీఖున పాన్ ఇండియన్ భాషలతో పాటుగా ఇంగ్లీష్ లో కూడా ఈ ఘనంగా విడుదల కాబోతుంది.#RRR చిత్రం తర్వాత వచ్చిన పాన్ వరల్డ్ మార్కెట్ ని సంపూర్ణంగా వాడుకునేందుకు సిద్ధం అయిపోయింది సలార్.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మూవీ టీం అతి త్వరలోనే తెలియజెయ్యనుండి మూవీ టీం.అయితే ప్రస్తుతం బాహుబలి 2 సినిమా రెండు వేల కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఆల్ టైం నెంబర్ 1 ఇండియన్ గ్రాసర్ గా నిల్చింది.ఇప్పుడు సలార్ చిత్రం హాలీవుడ్ లో కూడా క్లిక్ అయితే నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లు వస్తాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.