Krithi Shetty : ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లో మెరిసిపోతున్న బేబమ్మ

- Advertisement -

Krithi Shetty : కృతి శెట్టి.. అదేనండి బేబమ్మ.. ఈమధ్య ఈ బ్యూటీ జోరు కాస్త తగ్గినట్టుగా కనిపిస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే కనిపిస్తోంది. తాజాగా కృతి ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లో మెస్మరైజ్ చేసింది. తన అందంతో మెరిపిస్తూ అభిమానులను మైమరిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఎల్లో కలర్ డ్రెస్సులో కృతి శెట్టి చాలా ట్రెడిషనల్ గా కనిపించింది. డ్రెస్సు చున్నీకి ఉన్న అందాల మెరుపుల్లో కృతి మరింతగా మెరిసిపోయింది. క్యూట్ స్మైల్ తో మాయ చేసింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు. కృతి చాలా అందంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Actress Krithi Shetty
Actress Krithi Shetty

కృతి శెట్టి ట్రెడిషనల్ లుక్స్ చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఎల్లో కలర్ డ్రెస్సులో కృతి మెస్మరైజ్ చేస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు. బేబమ్మ. ఈజ్ సో బ్యూటీఫుల్, ఎంతందంగా ఉన్నావే బేబమ్మ.. ఐలవ్యూ బేబమ్మ.. అంటూ కామెంట్లతో ఇన్ బాక్స్ నింపేస్తున్నారు. ప్రస్తుతం కృతి ట్రెడిషనల్ ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ మారాయి.

- Advertisement -
Krithi Shetty Photos

ఇక కృతి సినిమాల విషయానికి వస్తే గతేడాది ఈ బ్యూటీకి బ్యాడ్ ఇయర్ నే చెప్పాలి. ఆమె నటించిన మూడు సినిమాలు నెలల గ్యాప్ లో భారీ డిజాస్టర్స్ అయ్యాయి. దానితో బేబమ్మ సైలెంట్ అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా అంతగా యాక్టివ్ గా లేదు.

Krithi Shetty

కాస్త గ్యాప్ తర్వాత కృతికి ఆఫర్లు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ కమ్ బ్యాక్ ఇచ్చింది. ప్రస్తుతం కృతి తమిళ, మలయాళంలో జెండా పాతడానికి రెడీ అయ్యింది. ఇక టాలీవుడ్ లో ప్రస్తుతం కృతి నాగచైతన్య కస్టడీ సినిమాలో నటిస్తోంది.

Krithi Shetty

ఒక్క సినిమాతో.. అది కూడా సినిమా రిలీజ్ కాకముందే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కృతి శెట్టి. మొదటి సినిమా విడుదలకు ముందే తన ఖాతాలో అరడజను అవకాశాలు వేసుకుంది.  స్టార్ హీరోయిన్ కూడా గ్లామర్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంటే.. కృతి శెట్టి మాత్రం ఎక్కువగా నెట్టింట యాక్టివ్ గా కనిపించదు.  అంతే కాదు ఈ బ్యూటీ ఎక్కువ అందాల ప్రదర్శన కూడా చేయదు. కానీ తన క్యూట్ లుక్స్ తోనే మాయ చేస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here