ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న Prabhas..

- Advertisement -

Prabhas టాలివుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి..ఈయన పెళ్లిపై అప్డేట్ ఎప్పుడిస్తారా అని అటు ఫ్యామిలీ, ఇటు సెలెబ్రేటీలు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.. అయితే తాజాగా ఈయన పెళ్లికి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. అంతేకాదు ఈ విషయం స్వయంగా ప్రభాస్ చెప్పాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ఆయన ఫ్యాన్స్ లో పెద్ద చర్చే జరుగుతుంది అస్సలు చేసుకొనే ఉద్దేశ్యం అన్నా ఉందా అని కొందరు సినీ ప్రముఖులు అంటున్నారు..

Prabhas
Prabhas

ప్రభాస్ ఇండస్ట్రీకి ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైయ్యాడు..ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతున్న హీరో.అలాంటి ప్రభాస్ కి 4 పదుల వయసులో కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోవడం లేదు. ఇక ఈ విషయంలో ఇప్పటికే ప్రభాస్ అభిమానులు చాలా నిరాశపడుతున్నారు. అయితే తాజాగా ప్రభాస్ తన పెళ్లి గురించి ఒక క్లారిటీ ఇచ్చారట. డార్లింగ్ కి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదట.. దానికి ఇంకా సమయం ఉందని చెప్పినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు..

అయితే, ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్న తన సినిమాలన్నీ ముగించుకున్నాకే పెళ్లి గురించి ఆలోచిస్తానని క్లారిటీ ఇవ్వడంతో చాలామంది ఇక ప్రభాస్ పెళ్లి జరగడానికి ఇంకా రెండు సంవత్సరాల టైం పడుతుందా అని కామెంట్లు పెడుతున్నారు.ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్ చేతిలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైనా సలార్, స్పిరిట్,ప్రాజెక్ట్ కే,రాజా డీలక్స్ వంటి సినిమాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలు పూర్తవడానికి కనీసం రెండు సంవత్సరాలైనా పడుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే సినిమాలన్నీ ముగించే వరకు ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కరు కావచ్చు అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఆయన పెళ్లి ఇంకా రెండు సంవత్సరాల వరకు కాదు అని తెలియడంతో నిరాశపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇది ఫ్యాన్స్ కు గుడ్ న్యూసే.. రెండేళ్లలో పెళ్లి చేసుకోబోతున్నాడని ఖుషి అవుతున్నారు..ఇప్పటికైనా ప్రభాస్ తన పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.. అప్పుడైనా చేసుకుంటాడో లేదో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here