Guess The Actress : కొంతమంది నటీనటులు చిన్న చిన్న పాత్రలు పోషించినా జనాలకు బాగా గుర్తుండిపోతారు.అయితే భవిష్యత్తులో వాళ్ళే కొన్ని పాన్ ఇండియా వెబ్ సిరీస్ లలో మరియు సినిమాలలో నటిస్తే, ఈ అమ్మాయిని ఎక్కడో చూసామే అని అనిపిస్తుంది.ఆ తర్వాత ఆమె గురించి గూగుల్ లో వితికితే ఆమె హిస్టరీ తెలిసి అందరూ ఆశ్చర్యపొయ్యే పరిస్థితి వస్తుంది.అలాంటి అమ్మాయి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము.క్రింద చూపిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ కి సంబంధించిన ఫొటోలో ఉన్న ఈ అమ్మాయి ని అంత తేలికగా మరచిపోలేము.ఎందుకంటే చిన్న నిడివి పాత్రే అయ్యినప్పటికీ కూడా గుర్తుండిపోయ్యే రేంజ్ అన్నమాట.

ఆ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సుప్రియ అయిసోల.ఈమె ఇప్పటి వరకు టాలీవుడ్ లో పలు సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించింది. ముఖ్యంగా ‘బాబు బాగా బిజీ’ అనే సినిమాలో వేశ్య పాత్ర పోషించి సంచలనం సృష్టించింది . ఇందులో ప్రముఖ నటుడు/ రచయితా అవసరాల శ్రీనివాస్ హీరో గా నటించాడు. ఈ సినిమాకి యూట్యూబ్ లో అద్భుతమైన వ్యూస్ కూడా వచ్చాయి. కానీ ఆమెకి తెలుగు లో ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే వచ్చాయట.

అలాంటి వాటిల్లో ప్రతీసారి నటించడం ఇష్టం లేకనే టాలీవుడ్ ఇండస్ట్రీ ని వదిలేసి బాలీవుడ్ లో స్థిరపడింది. అక్కడ ఈమెకి పవర్ ఫుల్ పాత్రలు దక్కాయి. ఒక తెలుగు అమ్మాయి అయ్యుండి ఇక్కడ అవకాశాలు రాక అక్కడకి వలస వెళ్లిపోవడం అనేది నిజంగా దురదృష్టకరం అనే చెప్పాలి.ఇలా మన ఇండస్ట్రీ కి చెందిన ఎంతో మంది తెలుగు హీరోయిన్స్ సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూసి, ఆ తర్వాత బాలీవుడ్ కి వలస వెళ్లినవాళ్ళే. ఇక్కడ సక్సెస్ కాకపోయినా అక్కడ సక్సెస్ అయ్యారు, సుప్రియ పరిస్థితి కూడా అంతే.

ఇక రీసెంట్ గానే సుప్రియ విక్టరీ వెంకటేష్ – రానా దగ్గుపాటి కాంబినేషన్ తెరకెక్కిన ‘రానా నాయుడు‘ అనే వెబ్ సిరీస్ లో ఒక కీలక పాత్ర పోషించింది. ఈ పాత్రకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఆమె లేటెస్ట్ లుక్స్ ని చూసి మాత్రం అందరూ ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన అమ్మాయి యేనా సుప్రియ అని ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు.
