Rakul Preet Singh రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి సోషల్ మీడియాలో తన లుక్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈసారి బోల్డ్ ఫొటోషూట్ తో కాకుండా క్యూట్ ఫొటోలతో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. రకుల్ అట్టైర్ చూసిన నెటిజన్లు భలే కూల్ లుక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బ్లాక్ షర్ట్ లో.. ఫిల్మీ ప్యాంట్ లో రకుల్ కూల్ పోజులిచ్చింది. ఈ ప్యాంట్ చూసి నెటిజన్లు భలే ఫిదా అవుతున్నారు. ప్యాంట్ భలేగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్యాంట్ నిండా బాలీవుడ్ సినిమా పోస్టర్లే ఉన్నాయి.. టాలీవుడ్ సంగతేంటంటూ ప్రశ్నిస్తున్నారు. కానీ లుక్ మాత్రం చాలా స్టైలిష్ గా డిఫరెంట్ గా ఉందంటున్నారు.
మేకప్ వేసుకుంటూ రకుల్ ఇచ్చిన పోజులు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ ఫొటోలు చూస్తే రకుల్ వ్యానిటీ వ్యాన్ లో దిగినట్టున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదైమానా రకుల్ తన ట్రెండీ లుక్ లో భలే అందంగా ఉందంటూ పొగిడేస్తున్నారు.
ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే కొంతకాలంగా ఈ బ్యూటీ తన మకాం ముంబయికి మార్చింది. అక్కడే సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే నాలుగైదు సినిమాలు చేసి బీ టౌన్ లోనూ తన సత్తా చాటింది. ఇటీవలే ఛత్రివాలీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
టాలీవుడ్ లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన రకుల్ బాలీవుడ్ లో మాత్రం కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. మొదటి నుంచి బీ టౌన్ లో వైవిధ్యమైన స్క్రిప్టుకే ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అయ్యారే, డాక్టర్ జీ, ఛత్రివాలీ సినిమాలు ఈ కోవలోకి చెందినవే. ప్రస్తుతం ఈ భామ ముంబయిలోనే సెటిల్ అయింది. బాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమలో పడింది. ఈ జంట తరచూ బీ టౌన్ మీడియా కంట పడుతూ తమ రిలేషన్ షిప్ ను ఓపెన్ గానే ఉంచుతున్నారు. తరచూ వెకేషన్లకు వెళ్తూ ఈ లవ్ బర్డ్స్ తమ లవ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.