Kiraak RP: జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. జబర్దస్త్ లో తన స్కిట్స్, పంచ్ డైలాగులతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు.. అనూహ్యంగా జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసిన ఆర్పి ప్రస్తుతం వ్యాపార రంగంలో తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు.. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ లో స్టార్ట్ చేసిన ఆర్పీ.. తన బిజినెస్ ను మూడో ప్రాంచైజ్ చేసి విస్తరించే వరకు వచ్చాడు.. తాజాగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల బిజినెస్ మూడో బ్రాంచ్ ను సినీ హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ఓపెన్ చేశారు. అందులో భాగంగా తన పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలను కిరాక్ ఆర్పి పంచుకున్నారు..
తాజాగా మీడియాతో ఆర్పీ మాట్లాడుతూ కస్టమర్ల సంతృప్తి తనకు ముఖ్యమని వ్యాపారంలో లాభాలు రాకపోయినా తనకు పరవాలేదని కామెంట్స్ చేశారు. త్వరలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ప్రాంచైజీ లను మొదలు పెడుతున్నానని ఆర్పి తెలిపారు. ఇక అదే సమయంలో తన పెళ్లి గురించి ప్రస్తావన రాగా.. లక్ష్మీ ప్రసన్న గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు..
గత ఏడాది మేలో ఆర్పి కి లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయితో నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక పెళ్లెప్పుడు అనే సందేహం అందరిలో ఉండగా.. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. నాకు అబద్దాలు చెప్పడం రాదు. లక్ష్మీ ప్రసన్న వెంట నేను రెండేళ్లు పిచ్చి కుక్కలాగా తిరిగాను. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. నవంబర్ 29న పెళ్లి చేసుకోబోతున్నామని కిరాక్ ఆర్పి తెలిపారు.
ఇక లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ వారి లవ్ స్టోరీ రివీల్ చేసింది. లక్ష్మీ ప్రసన్న ఆర్సి రెడ్డి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకునేటప్పుడు ఆర్పీ గెస్ట్ గా వచ్చారట. అప్పుడే వారికి పరిచయం అయిందని.. ఆ తర్వాత తన దగ్గర నుంచి వాళ్ళ అమ్మ నెంబర్ తీసుకొని ఇంట్లో వాళ్లకు దగ్గర అయ్యాడట. చుట్టాలకు కూడా క్లోజ్ అవ్వడంతో ఆ తర్వాత లక్ష్మీ ప్రసన్న పేరెంట్స్ తో మాట్లాడి పెళ్లికి ఒప్పించారని తెలిపింది. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కి ఆర్పీ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ ఏడాది మూడుముళ్ల బంధంతో ఆర్పీ లక్ష్మీ ప్రసన్న ఒకటి కానున్నారు.. మరి కొంతమంది నేటిజన్స్ మాత్రం కిరాక్ ఆర్పి నువ్వు అన్నాళ్లు తన వెంట తిరిగినా కానీ.. కుందనపు బొమ్మలాంటి అమ్మాయిని పట్టేసాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.