Pavitra Lokesh భర్త ఎంత పెద్ద స్టార్ నటుడో తెలుసా..! అతని బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే నోరెళ్లబెడుతారు

- Advertisement -

Pavitra Lokesh గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశాలలో ఒకటి పవిత్ర లోకేష్ – నరేష్ ప్రేమ వ్యవహారం.గత కొంత కాలం గా ప్రేమించుకుంటూ డేటింగ్ కొనసాగిస్తున్న ఈ జంట ఇటీవలే పెళ్లి బంధం తో ఒక్కటయ్యారు.మొన్న రాత్రి కొంతమంది బంధు మిత్రుల సమక్ష్యం లో వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు.ఈ పెళ్లికి సంబంధించిన వీడియో ని స్వయంగా నరేష్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులకు తెలియజేసాడు.

Pavitra Lokesh
Pavitra Lokesh

ఇప్పుడు ఈ జంట హనీమూన్ ని ఎంజాయ్ చేస్తుంది.లోకులు వీళ్ళ గురించి ఎన్ని కామెంట్స్ చేసిన పట్టించుకోకుండా పెళ్లి చేసుకొని తమ లోకం తమదే అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఈ జంట గురించి సోషల్ మీడియా లో పలు వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.నరేష్ కి ఇది నాల్గవ పెళ్లి అనే విషయం తెలిసిందే.ఆయన మూడవ భార్య విడాకులు ఇవ్వనప్పటికీ ఆయన నాల్గవ పెళ్లి చేసుకోవడం విశేషం.

pavitra naresh

అయితే ప్రవిత్ర కి కూడా ఇది మొదటి పెళ్లి కాదు, రెండవ పెళ్లి.ఆమె గతం లో సుచేంద్ర అనే అతనిని ప్రేమించి పెళ్లాడింది.2007 వ సంవత్సరం లో వీళ్లిద్దరికీ పెళ్లి జరిగింది, వీళ్ళకి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.ఇక సుచేంద్ర విషయానికి వస్తే , ఇతగాడు కన్నడలో పాపులర్ యాక్టర్.ఎన్నో సినిమాల్లోనూ క్యారక్టర్ ఆర్టిస్టుగా, అలాగే ఎన్నో టీవీ సీరియల్స్ లో కూడా నటించాడు.పవిత్ర లోకేష్ కూడా కన్నడ చలన చిత్ర పరిశ్రమకి చెందిన అమ్మాయి.

- Advertisement -
pavitra naresh family

కెరీర్ ప్రారంభం లో అక్కడ ఆమె 20 కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది, ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా బాగా రాణించింది. సుచేంద్ర తో ఒక టీవీ సీరియల్ లో నటిస్తున్న సమయం లో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకునేలా చేసింది. అయితే వీళ్లిద్దరి మధ్య పరస్పరం ఏర్పడిన కొన్ని విబేధాల కారణం గా విడిపోవాల్సి వచ్చింది, ఆ తర్వాత నటుడు నరేష్ కి దగ్గరై మరోసారి ప్రేమలో పడి పెళ్లాడింది పవిత్ర లోకేష్ . కనీసం ఈయనతోనైనా జీవితాంతం కలిసి ఉంటుందో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here