Kajal Aggarwal : స్టార్ సెలెబ్రిటీల కిడ్స్ సినిమాల్లోకి బాలనటులుగా రావడం అనేది మన టాలీవుడ్ లో కొత్తేమి కాదు,ఇది వరకు ఎంతో మంది స్టార్ సెలెబ్రిటీల కిడ్స్ బాలనటులుగా వచ్చి ప్రేక్షకుల మెప్పు పొంది, భవిష్యత్తులో కూడా పెద్ద స్టార్ హీరోలు గా ఎదిగి ఇండస్ట్రీ ని శాసిస్తున్నారు.ఇప్పుడు అందరి ద్రుష్టి కాజల్ అగర్వాల్ కొడుకు మీద పడింది.రెండేళ్ల క్రితం పెళ్లి గౌతమ్ కిచులు అనే అతనిని కాజల్ అగర్వాల్ పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే.ఏడాది క్రితమే వీళ్లిద్దరికీ ఒక బాబు కూడా పుట్టాడు.
సోషల్ మీడియా లో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఆ బాబు కి సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది కాజల్ అగర్వాల్.ఆ ఫోటోలకు మిలియన్ల సంఖ్యలో లైక్స్ మరియు కామెంట్స్ వస్తుంటాయి.పిల్లాడు ఎంత ముచ్చటగా ఉన్నాడు, సినిమాల్లోకి తీసుకొని రావొచ్చు కదా అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతూనే ఉన్నారు.ఇక చాలా కాలం తర్వాత కాజల్ అగర్వాల్ నిన్న తన కొత్త సినిమా ‘గోష్ఠి’ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా అభిమానులతో కాసేపు చిట్ చాట్ నిర్వహించింది.
ఈ చిట్ చాట్ లో కొంతమంది అభిమానులు మీ అబ్బాయిని సినిమా ఇండస్ట్రీ కి తీసుకొస్తారా అని అడుగుతారు.అప్పుడు ఆమె దానికి సమాధానం చెప్తూ ‘కచ్చితంగా మా అబ్బాయిని బాలనటుడి స్థాయి నుండే ఇండస్ట్రీ కి తీసుకొస్తాను,కానీ వాడికి 8 సంవత్సరాలు కచ్చితంగా నిండి ఉండాలి,అప్పుడే తీసుకొస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది. మీ అబ్బాయికి మీరు నటించిన సినిమాలు కానీ వీడియోలు కానీ ఏమైనా చూపించారా అని అడిగిన ప్రశ్నకి కాజల్ అగర్వాల్ సమాధానం చెప్తూ ‘ఇప్పటి వరకు లేదు.,ఇంకో సంవత్సరం ఆగాలి, నేను నటించిన సినిమాలలో వాడికి మొట్టమొదట తుపాకీ చిత్రాన్ని చూపిస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్.
ఇక కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ‘గోష్ఠి’ చిత్రం మార్చి 17 వ తారీఖున విడుదల కాబోతుంది. హారర్ కామెడీ జానర్ట్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పోలీస్ అధికారి గా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమాకి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.