Venkatesh : ఆరోజుల్లో విక్టరీ వెంకటేష్ ఆ హీరోయిన్ తో ఇంత ప్రేమాయణం నడిపాడా..బయటపడ్డ షాకింగ్ నిజం

- Advertisement -

Venkatesh : టాలీవుడ్ లో కాంట్రవర్సీ లేని హీరో కానీ, హీరోయిన్ కానీ దొరకడం చాలా కష్టం, ప్రతీ ఒక్కరికీ ఎదో ఒక కాంట్రవర్సీ ఉంటుంది.అలా ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఇండస్ట్రీ లో ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది విక్టరీ వెంకటేష్ మాత్రమే.సుమారుగా నాలుగు దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో ఉన్నాడు, ఇప్పటి వరకు ఆయన గురించి చెడుగా వినింది ఒక్కటి కూడా లేదు, అంత స్వచ్ఛమైన తెల్ల కాగితం వంటి వాడు విక్టరీ వెంకటేష్.

Venkatesh
Venkatesh

కానీ అలాంటి హీరో మీద కూడా అప్పట్లో ఒక హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతున్నాడు అంటూ రూమర్స్ వచ్చాయంటే ఎవరైనా నమ్ముతారా..? కానీ నిజంగానే ఆరోజుల్లో వెంకటేష్ మీద కూడా పలు రూమర్స్ వచ్చాయి.దీనిపై వెంకటేష్ అప్పట్లో స్పందించి వివరణ కూడా ఇచ్చాడు, రీసెంట్ ఇంటర్వ్యూస్ లో కూడా దీని గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.

Venkatesh Daggubati

ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు, సౌందర్య.ఆరోజుల్లో విక్టరీ వెంకటేష్ మరియు సౌందర్య కాంబినేషన్ చూడడానికి ఎంతో ముచ్చటగా ఉండేది.భార్యభర్తలు అంటే ఇలాగే ఉండాలి అనిపించే రేంజ్ లో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ ఉండేది.ఆ రేంజ్ కెమిస్ట్రీ ఉంటే మన గాసిప్ రాయుళ్లు ఎలాంటి కథనాలు రాస్తారో తెలుసుగా!.అప్పటికే వెంకటేష్ పెళ్ళైపోయిన కూడా సౌందర్య తో ఎఫైర్ ఉందని రూమర్స్ పుట్టించారు.ఈ రూమర్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి కూడా.ఈ వార్తలపై అప్పట్లో వెంకటేష్ చాలా బాధపడుతూ స్పందించాడు.

- Advertisement -
Venkatesh Roja

ఆయన మాట్లాడుతూ ‘సౌందర్య నాకు చెల్లెలు లాంటిది..మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఎంతో పవిత్రమైనది. నేను ఎప్పుడూ ఆమెని చెల్లిగానే చూస్తాను, ఆమె నన్ను అన్నయ్య అని పిలుస్తుంది కూడా. దయచేసి మీ మీడియా మైలేజ్ కోసం ఇలాంటి వార్తలను సృష్టించవద్దు’ అంటూ వెంకటేష్ ఈ సందర్భంగా మాట్లాడాడు. అలా వెంకటేష్ మీద ఆరోజుల్లో వచ్చిన ఏకైక రూమర్ ఇదొక్కటే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here