Upendra కన్నడ చలన చిత్ర పరిశ్రమ ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎంత గొప్ప స్థానం లో ఉందో మన అందరికీ తెలిసిందే. వరుసగా KGF సిరీస్ మరియు కాంతారా వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో సౌత్ ఇండియన్ సినిమా పవర్ ఏంటో చూపిస్తూ కన్నడ సినిమాలకే క్రేజ్ ని తీసుకొచ్చాయి. ఈ చిత్రాలు.ఇక మొదటి నుండి మన తెలుగు ఆడియన్స్ కి కన్నడ అంటేనే గుర్తుకు వచ్చే పేరు Upendra Rao.
ఆరోజుల్లో ఆయన డబ్బింగ్ మూవీస్ చాలా వరకు తెలుగు లో సూపర్ హిట్స్ గా నిలిచి కాసుల వర్షం కురిపించాయి.అయితే గడిచిన రెండు దశాబ్దాల నుండి ఉపేంద్ర కి తెలుగు లో సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు.ఆడియన్స్ ఆయన గ్రాండ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాన్ ఇండియా లెవెల్ లో ‘కబ్జా’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ బెంగళూరు లో ఈమధ్యనే జరిగింది.ఈ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాడట ఉపేంద్ర. పవన్ కళ్యాణ్ వస్తానని ఒప్పుకున్నాడు కానీ, తనకి ఉన్న బిజీ షెడ్యూల్స్ వల్ల చివరి నిమిషం లో రాలేని పరిస్థితి ఏర్పడింది. దీనితో ఆయన ఉపేంద్ర కి క్షమాపణలు చెప్తూ ఒక లేఖ ని విడుదల చేసారు.
ఆయన మాట్లాడుతూ ‘నా చిరకాల మిత్రుడు ఉపేంద్ర గారి కబ్జా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేకపోతున్నందుకు నేను ఎంతో చింతిస్తున్నాను.సరిగ్గా అదే సమయం లో షూటింగ్ పొడిగింపు అవ్వడం వల్ల రాలేని పరిస్థితి ఏర్పడింది.ఎల్లప్పుడూ భిన్నమైన ఆలోచనలతో ఉపేంద్ర గారు తీసే సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం, గతం లో ఆయన చేసిన సినిమాలన్నీ ఎంతో ఆసక్తిగా చూసేవాడిని.ఇప్పుడు కబ్జా చిత్రం ద్వారా మళ్ళీ తరహా విభిన్నమైన కథాంశం తో మన ముందుకి వస్తున్నా ఉపేంద్ర గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.ఈ సినిమాలో మరో హీరో గా నటించిన కిచ్చా సుదీప్ గారికి కూడా ఇదే నా శుభాకాంక్షలు. ఆయన కూడా నాకు ఎంతో మంచి మిత్రుడు’ అంటూ పవన్ కళ్యాణ్ ఒక లేఖని విడుదల చేసాడు.