టాలివుడ్ లో Manchu Lakshmi పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు.. మంచు మోహన్ బాబు కూతురుగా ఎంట్రీ ఇచ్చిన తన టాలెంట్ తో అడపాదడపా సినిమాలను చేస్తూ బిజీగా ఉంది.. ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉంటుంది..రోజుకో విధంగా ఫోటో షూట్ లు చేస్తూ జనాలకు పిచ్చెక్కిస్తుంది..తాజాగా మంచు లక్ష్మి మెస్మరైజింగ్ ఫోటో షూట్ తో వచ్చారు. ఆమె డిజైనర్ వేర్ ధరించి రాయల్ లుక్ ట్రై చేశారు. మంచు లక్ష్మి ఫోటో షూట్ వైరల్ అవుతుంది.ఈ అమ్మడు అసలు తగ్గడం లేదు.ఈ వయస్సులో అరాచకం చేస్తుంది..ట్రెండీ డిజైనర్ వేర్ ధరించి సూపర్ గ్లామరస్ ఫోజులిచ్చారు. ఫ్యాషన్ డిజైనర్ వరుణ్ చక్కిలం ప్రత్యేకంగా రూపొందించిన బట్టల్లో మెరిశారు. తనకు గ్రాండ్ రాయల్ లుక్ ఇచ్చిన సదరు డిజైనర్ కి ధన్యవాదాలు ఆమె తెలిపారు.
ఆమె ఫోటోలను ట్రోల్ చేసేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారు. ఈ వయసులో ఇలాంటి పోజులు అవసరమా, మీకు మేకప్ ఎక్కువైంది అంటూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే మంచు లక్ష్మి అవేమీ పట్టించుకోదు. పనీ పాట లేని వాళ్ళు చేసే పనులంటూ కొట్టిపారేస్తుంది..ఇక మంచు ఫ్యామిలిని సోషల్ మీడియాలో లో ఏదొక విషయం పై ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు.మంచు ఫ్యామిలీ చిత్రాలు చేస్తూనే ఉంటారు. గత ఏడాది మంచు విష్ణు హీరోగా జిన్నా విడుదలైంది. అది డిజాస్టర్ అయ్యింది. 2021లో మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన సన్ ఆఫ్ ఇండియా థియేటర్స్ లోకి వచ్చింది. ఆ మూవీ డబుల్ డిజాస్టర్. చివరికి మంచు లక్ష్మికి కూడా కాలం కలిసి రావడం లేదు. ఎన్ని సినిమాలు చేసినా కనీస ఫేమ్ అందుకోలేక పోతున్నారు..
ఇకపోతే తాజాగా ఆమె అగ్ని నక్షత్రం టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలో విడుదల కానుంది. అగ్నినక్షత్రంతో పాటు కొన్ని చిత్రాలు వెబ్ సిరీస్లలో నటిస్తున్నట్లు మంచు లక్ష్మి వెల్లడించారు. అగ్ని నక్షత్రం మూవీలో మంచు లక్ష్మి లుక్ ఆకట్టుకుంది.. మంచు లక్ష్మి ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. తమ్ముడు మనోజ్ రెండో వివాహం చేసుకుంటున్నారు. మార్చి 3న మంచు మనోజ్ పెళ్లి జరగనుందని విశ్వసనీయ సమాచారం. ఆల్రెడీ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి.. ఆ పెళ్లికి భారీగా జనాలు రానున్నారని సమాచారం..