Samantha : సౌత్ ఇండియన్ టాప్ మోస్ట్ హీరోయిన్ సమంత ఈమధ్య రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కాకుండా, కాస్త నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేస్తూ వస్తున్నా సంగతి అందరికీ తెలిసిందే. గతం లో ఈమె అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2 ‘ లో పోషించిన విలన్ రోల్ కి ఇండియా వైడ్ ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అందరూ చూసారు.ఈ సిరీస్ తర్వాత ఆమెకి బాలీవుడ్ లో అలాంటి నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే దొరుకుతున్నాయి.
అందులో భాగంగానే అమెజాన్ ప్రైమ్ తెరకెక్కిస్తున్న మరో యాక్షన్ థ్రిల్లర్ ‘సీటా డెల్’ చిత్రం లో రా ఏజెంట్ గా నటిస్తుంది.ఇందులో హీరో గా ప్రముఖ బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ చేస్తున్నాడు.సమంత ఈ చిత్రం ఒళ్ళు గగురుపొడిచే యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తుందట.ఆమె చేసే ఫైట్స్ చూస్తే ఆడియన్స్ నోరెళ్ళబెట్టి అలా చూస్తూ ఉండిపోతారట.ఆ రేంజ్ లో ఆ సన్నివేశాలు ఉండబోతున్నాయని టాక్.
అయితే ఈ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయం లో సమంత చేతికి చాలా తీవ్తమైన గాయాలు తగిలాయి. అలా గాయాలతో నిండిపోయిన తన చేతిని సమంత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ పెట్టిన ఒక ఫోటో అభిమానులను తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తుంది.ఇన్ని రోజులు ఆమె ‘మయోసిటిస్’ అనే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ప్రాణాపాయం నుండి బయటపడి షూటింగ్స్ లో తిరిగి చురుగ్గా పాల్గొంటున్న సమంత ఇలా గాయాలపాలవ్వడం ఆమె అభిమానులను కంగారు పెట్టెల చేస్తున్నాయి.
ఎప్పుడూ రిస్క్ తో సావాసం చేసే సమంత కాస్త తన శరీరం పట్ల జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.సమంత ఈ సిరీస్ తో పాటుగా తెలుగు లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘ఖుషి’ చిత్రం లో హీరోయిన్ గా చేసేందుకు ఒప్పుకున్న సంగతి అందరికీ తెలిసిందే.త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతుంది సమంత.