Rao Ramesh : ఆరోజుల్లో విలనిజం అంటే మనకి గుర్తుకు వచ్చే రెండు మూడు పేర్లలో ఒకటి రావు గోపాల రావు.తనదైన మ్యానరిజమ్స్ తో కాస్త హ్యూమర్ ని జోడించి ఆయన పండించే విలనిజం ఆరోజుల్లో ఒక సెన్సేషన్.ప్రతీ అగ్ర సినిమాలో రావు గోపాల్ రావు ఉండేవాడు.ఆయన డేట్స్ సంపాదించడం కోసం నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారేది.అంతటి డిమాండ్ ఉన్న రావు గోపాల్ రావు చనిపోయిన తర్వాత కొన్నాళ్ళకు ఆయన కుమారుడు రావు రమేష్ ఇండస్ట్రీ కి వచ్చాడు.

ఈయన కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.క్యారక్టర్ ఆర్టిస్టు గా, విలన్ గా మరియు కమెడియన్ గా రావు రమేష్ నటన అద్భుతంగా ఉంటుంది.అందుకే ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే వేరే లెవెల్ కి వెళ్ళిపోయాడు.ఇది వరకు తనలోని ఎన్నో కోణాలను మనకి చూపించిన రావు రమేష్, త్వరలోనే తనలోని హీరోని కూడా ఆడియన్స్ కి పరిచయం చెయ్యబోతున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే రావు రమేష్ హీరో గా ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ అనే సినిమా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుంది. హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా తీసిన లక్ష్మణ్ కార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈయన ఈ సినిమాతో పాటుగా ‘ఎందుకిలా’ అనే వెబ్ సిరీస్ మరియు యాంకర్ ప్రదీప్ ఆద్వర్యం లో నడిచిన ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా’ టాక్ షోస్ కి డైరెక్టర్ గా పనిచేసాడు.

ఇక రావు రమేష్ కి జోడిగా అందాల తార ఇంద్రజ హీరోయిన్ గా నటిస్తుంది. ఫన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతుందట ఈ చిత్రం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఇన్ని రోజులు క్యారక్టర్ ఆర్టిస్టు గా ఆడియన్స్ మెప్పు పొందిన రావు రమేష్, హీరో గా కూడా ఆడియన్స్ ని అలరిస్తాడో లేదో చూడాలి.
