Ram Charan : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం గత ఏడాది విడుదలై ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. కేవలం థియేటర్స్ లో మాత్రమే కాదు, డిజిటల్ మీడియా లోకి అందుబాటులో వచ్చిన తర్వాత ఈ సినిమా బౌండరీస్ అన్నిటిని బ్లాస్ట్ చేసి పాన్ వరల్డ్ ఆడియన్స్ చేత శబాష్అ నిపించుకుంది. హీరోలిద్దరితో పాటుగా డైరెక్టర్ రాజమౌళి పై కూడా ఫారిన్ ఆడియన్స్ ప్రశంసల వర్షం కురిపించారు.
ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, లాస్ ఏంజిల్స్ ఫిలిం క్రిటిక్ అవార్డ్స్ ని సొంతం చేసుకున్న #RRR, ఇప్పుడు లేటెస్ట్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో నామినేషన్స్ లో చోటు సంపాదించి చరిత్ర సృష్టించింది. వచ్చే నెల 12 వ తారీఖున జరగబోతున్న ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ కి #RRR మూవీ టీం మొత్తం హాజరు కాబోతుంది.కానీ ఇంతలోపే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొనాల్సిందిగా రామ్ చరణ్ కి ఆహ్వానం అందింది.
ఈ ఈవెంట్ లో #RRR సినిమాకి ‘స్పాట్ లైట్ ఆఫ్ ది ఇయర్’ అనే అవార్డు ని అందించబోతున్నారు.అంతే కాకుండా ఉత్తమ నటుడి క్యాటగిరీ లో కూడా రామ్ చరణ్ , ఎన్టీఆర్ నామినేషన్స్ లో చోటు దక్కించుకున్నారు.ఇది ఇలా ఉండగా నిన్న రామ్ చరణ్ అమెరికా లోనే మోస్ట్ పాపులర్ షో గా పేరు సంపాదించుకున్న ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షో లో పాల్గొన్నాడు.
ఈ షో లో రామ్ చరణ్ #RRR సినిమా గురించి, రాజమౌళి గురించి తన కో స్టార్ జూనియర్ గురించి మరియు భవిష్యత్తులో తానూ చెయ్యబోతున్న ప్రాజెక్ట్స్ గురించి విలేఖరులు అడిగిన ప్రశ్నలకు చాలా ఆసక్తికరమైన సమాదానాలు చెప్పాడు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియోలే ట్రెండ్ అవుతూ ఉన్నాయి.’రాజమౌళి ఇండియన్ స్పెల్ బర్గ్..#RRR సినిమా కేవలం ఒక టీజర్ లాంటిది.అసలు సినిమా రాజమౌళి తన తదుపరి చిత్రం తో చూపబోతున్నాడు..కచ్చితంగా ఆ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ పరంగా అద్భుతాలు సృష్టిస్తాది’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక తనకి పుట్టబోతున్న బిడ్డ గురించి రామ్ చరణ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు..ఆయన మాట్లాడుతూ ‘గతం లో నేనొక్కడినే ప్రపంచం మొత్తం తిరుగుతూ బాగా ఎంజాయ్ చేసేవాడిని, ఇనాళ్ళు నేను నా భార్య ఉపాసనకు అంత దొరికేవాడిని కాదు, కానీ ఇప్పుడు తప్పడం లేదు’ అంటూ నవ్వుతూ మాట్లాడాడు.అంతే కాకుండా అక్కడ రామ్ చరణ్ ని ఇంటర్వ్యూస్ చేస్తున్న ఇద్దరు యాంకర్స్ లో ఒకరు డాక్టర్.ఆమెని ఉద్దేశించి రామ్ చరణ్ మాట్లాడుతూ ‘మీరు డాక్టర్ అని ముందుగా నాకు తెలియదు.ఈసారి ఉపాసన తో వచ్చినప్పుడు మిమల్ని తప్పక కలుస్తాను’ అంటూ సమాధానం ఇస్తాడు రామ్ చరణ్.అప్పుడు ఆమె మాట్లాడుతూ ‘ఉపాసన కి డెలివరీ చేసే అదృష్టం నాకు వస్తే చాలా సంతోషం గా ఫీల్ అవుతాను..ఆ రోజు కోసం నేను కూడా ఎదురు చూస్తాను’ అంటూ బదులిస్తుంది.
ఇక ఉపాసన తో జీవితం పంచుకోవడం గురించి కూడా రామ్ చరణ్ చేసిన పలు ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది,ఆయన మాట్లాడుతూ ‘ఉపాసన నేను ఒకే కాలేజీ లో చదువుకున్నాము కానీ, కాలేజీ లో ఉన్నప్పుడు మా మధ్య అంత పరిచయం ఏర్పడలేదు.మా ఇద్దరి మధ్య ఉన్న కామన్ ఫ్రెండ్స్ వల్లే మేము మొదటిసారి కలుసుకున్నాం, అలా మా పరిచయం లండన్ లోని స్పోర్ట్స్ క్లబ్ లో జరిగింది.ఆ తర్వాత అది స్నేహం గా మారి, నేడు పెళ్లి చేసుకొని పదేళ్లు సక్సెస్ ఫుల్ గా మా దాంపత్య జీవితాన్ని పూర్తి చేసుకున్నాం..తాను నా జీవితం లోకి రావడం నేను అదృష్టం గా భావిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.