Ashish Vidyarthi భార్య ఎంత పెద్ద స్టార్ హీరోయినో తెలుసా?

- Advertisement -

Ashish Vidyarthi : తెలుగు, హిందీ , తమిళం మరియు కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో విలన్ గా క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి పేరు ప్రక్యతలు సంపాదించుకున్న నటుడు ఆశిష్ విద్యార్ధి. తెలుగు లో ఈయన పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘గుడుంబా శంకర్’ సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించాడు.టాలీవుడ్ లోకి అడుగుపెట్టే ముందే బాలీవుడ్ లో ఆయన పెద్ద స్టార్.1995 వ సంవత్సరం లో ‘దోర్హ్ కాల్’ అనే చిత్రం లో అద్భుతమైన నటన కనబర్చినందుకు గాను ఆయనకీ నేషనల్ అవార్డు కూడా దక్కింది.

Ashish Vidyarthi
Ashish Vidyarthi

అలా కేవలం మూడవ సినిమా తోనే నేషనల్ అవార్డు అందుకున్న ఏకైక ఆర్టిస్టు గా ఆశిష్ విద్యార్ధి చరిత్ర సృష్టించాడు. ఇక ఆ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అన్ని ప్రాంతీయ బాషలలో సుమారుగా 200 కి పైగా చిత్రాలలో నటించి ఇప్పటికీ బిజీ ఆర్టిస్టు గానే కొనసాగుతున్నాడు ఆశిష్ విద్యార్ధి.

Ashish Vidyarthi Photos

ఇక ఆశిష్ విద్యార్ధి భార్య రజోషి విద్యార్ధి కూడా బాలీవుడ్ లో పాపులర్ నటిగా అందరికీ సుపరిచితమే.బాడీ, గుడ్ సే మెహతా ఇష్క్ మరియు గిల్టీ మైండ్స్ అనే సినిమాలతో మంచి క్రేజ్ దక్కించుకుంది.అలాగే ఎన్నో బెంగాలీ సినిమాలలో హీరోయిన్ గా కూడా ఆమె నటించింది.ఈమె కేవలం నటి మాత్రమే కాదు సింగర్ మరియు గొప్ప డ్యాన్సర్ కూడా.

- Advertisement -
Ashish Vidyarthi Rajoshi Vidyarthi

ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత మంచి స్నేహితులుగా కొనసాగిన ఆశిష్ మరియు రజోషి కాలక్రమేణా ఒకరినొకరు బాగా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరి దంపతులకు అర్త్ విద్యార్ధి అనే కొడుకు కూడా ఉన్నాడు. ఇతగాడు యూట్యూబ్ లో పాపులర్ సెలబ్రిటీ, భవిష్యత్తులో ఇతను సినిమాల్లోకి వస్తాడో రాడో తెలియదు కానీ, ప్రస్తుతానికి అయితే ఆశిష్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో బాగా ఇంట్ర్యాక్ట్ అవుతున్నాడు.

 Rajoshi Vidyarthi Family
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here