Taraka Ratna : నందమూరి తారకరత్న నిన్న రాత్రి గుండెపోటుతో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. 40 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోవడంతో అభిమానుల వేదనకు హద్దులు లేకుండా పోయాయి. ముఖ్యంగా తారకరత్న కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. గుండెలవిసేలా ఆయన కూతురు విష్క్ర రోదన చూస్తుంటే మాత్రం చూసేవారి కంట కన్నీరు రావడం ఖాయం.
ఆరోగ్యంగా తిరిగి వస్తాడు అని.. గత 23 రోజులుగా ఎదురుచూస్తున్న వారికి చివరికి కన్నీళ్లే మిగిలాయి.. తారకరత్న భౌతిక కాయానికి రేపు అంత్యక్రియలు కూడా జరగనున్నాయి.. ఇప్పటికే నందమూరి అభిమానులు హైదరాబాదుకి వచ్చి తారకరత్న చివరి చూపు చూస్తున్నారు .. అయితే ఈ సమయంలోనే తారకరత్న వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలోని తారకరత్నకు సంబంధించి కొన్ని విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.. అసలు విషయంలోకి వెళ్తే నందమూరి తారక రామారావుకి 5వ కొడుకు అయిన మోహన కృష్ణకు తారకరత్న జన్మించాడు. మోహనకృష్ణ కూడా ఇండస్ట్రీలోనే ఉన్నాడు. కెమెరామెన్ గా చాలా సంవత్సరాలు తెలుగు సినిమాలకు పనిచేశాడు. ఇకపోతే మోహన కృష్ణకు ఇద్దరు సంతానం.. కొడుకు తారకరత్న.. కూతురు రూప..
తారకరత్నకు చెల్లి మోహన రూప అంటే పంచప్రాణాలు.. అయితే తారకరత్న అలేఖ్య రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో కుటుంబ సభ్యులకు నచ్చక చాలా సంవత్సరాల పాటు మోహనకృష్ణ కుటుంబం తారకరత్న కుటుంబాన్ని దూరం పెట్టింది. అలా తన పంచప్రాణాలైనా చెల్లికి కూడా ఆయన దూరం కావాల్సి వచ్చింది.
ఇకపోతే తారకరత్నకు .. ఇద్దరు కూతుర్లు.. ఒక కొడుకు జన్మించిన తర్వాత బాలయ్య ప్రోత్సాహంతో మళ్ళీ వారంతా ఒక్కటైనట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు 40 సంవత్సరాల వయసులోనే ఆయన మరణించడం తో ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది.