Vijay – Rashmika : అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.. ఆ తర్వాత వచ్చిన గీతాగోవిందం సినిమా కూడా జనాలకు గుర్తుండి పోయింది.. అంతలా కమెర్షియల్ హిట్ ను అందుకున్నాయి. గత ఏడాది వచ్చిన లైగర్ సినిమా డిజాస్టర్ అయ్యింది. అంతకు ముందు కూడా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తో నిరాశ పర్చాడు.
ఈయన చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతోంది. దాంతో ఈయన సినిమాలంటే జనాలకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దాంతో కెరీర్ చాలా డల్ గా సాగుతోంది. అయితే, గత కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండ, రష్మిక ల గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, ఇప్పుడు ఏకంగా పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి..
రష్మిక మందన్నా తో ఈయన ప్రేమ వ్యవహారం గురించి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా పెద్ద ఎత్తున వీరి ప్రేమ వ్యవహారం గురించి చర్చ జరుగుతోంది. ఆ మధ్య రష్మిక మేము కేవలం స్నేహితులం మాత్రమే అన్నట్లుగా కామెంట్స్ చేసింది. విజయ్ దేవరకొండ తో కలిసి మాల్దీవ్స్ కు వెళ్లిన విషయం తెల్సిందే. మొదట ఆ ట్రిప్ ను ఒప్పుకోని రష్మిక మందన్నా ఆ తర్వాత నిజంగానే తాము మాల్దీవ్స్ కి వెళ్లినట్లుగా ఒప్పుకుంది. దాంతో అసలు ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అంటూ చర్చలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి..
విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కూడా రష్మిక మందన్నా చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవలే రష్మిక యొక్క సొంత ప్రాంతానికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఒక వేడుకలో విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులు పాల్గొన్నారట. దాంతో త్వరలోనే రష్మిక మందన్నా మరియు విజయ్ దేవరకొండ యొక్క పెళ్లి జరగబోతుందని.. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పటి వరకు ఇద్దరి ప్రేమ గురించి అధికారికంగా క్లారిటీ రాలేదు.. కానీ వీరి కుటుంబాలు కలవడం తో అది నిజమేనని తెలుస్తుంది.. అసలు నిజమేంటో వారిద్దరే చెప్పాలి.. ప్రస్తుతం వీరిద్దరూ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు..