సినిమాల్లో గొప్ప క్రేజ్ లేకపోయినా లిమిట్ రోల్స్ తో చూడగానే ప్రేక్షకులు గుర్తుపట్టే రేంజ్ సెలబ్రిటీస్ చాలామంది ఉన్నారు. వారిలో ఒకరు ( Ravi Varma )రవి వర్మ, కృష్ణ వంశీ తెరకెక్కించిన రాఖీ సినిమా ద్వారా ఇతనికి మంచి పేరు వచ్చింది.ఆ తర్వాత ఇతను టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ అన్నీ లిమిటెడ్ రోల్స్ అవ్వడం గమనార్హం.ఇన్నేళ్ల నుండి ఇండస్ట్రీ లో ఉంటున్నప్పటికీ కూడా ఇతని ముఖం చూస్తే గుర్తుపట్టగలం ఏమో, పేరు మాత్రం ఎవరికీ తెలియదు.
ఇక ఇతని తమ్ముడు ఇంద్రనీల్ కూడా బుల్లితెర కథానాయకుడిగా మంచి పాపులారిటీ ని సంపాదించుకున్నాడు.మొగలి రేకులు , చక్రవాకం రీసెంట్ గా గృహ లక్ష్మి సీరియల్‌లలో లో మెయిన్ లీడ్ రోల్ చేసి మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈయన పలు సినిమాలలో కూడా నటించాడు.అలా ఈ ఇద్దరు అన్నదమ్ములు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతీ ఒక్కరికి సుపరిచితమే.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గా రవి వర్మ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు, అవి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.ఆయన మాట్లాడుతూ ‘నేను అమెరికన్ ఒక సిటిజెన్ ని, అక్కడే నేను స్థిరపడిపోయి ఉంటే ఈరోజు నా జీవితం మరోలా ఉండేది.అక్కడ నేను వేల్యూ కామ్, రీడిఫ్ వంటి ప్రఖ్యాత కంపెనీలలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేవాడిని, నాకు వచ్చే నెల జీతం లక్షల్లోనే ఉంటుంది, దాంతో పోలిస్తే సినిమాల్లో నాకు వచ్చే సంపాదన పెద్దగా ఏమి లేదని అనిపిస్తుంది.
నా స్నేహితుల ప్రోత్సాహం తోనే నేను సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాను.లేకుంటే అమెరికాలోనే పెద్ద మిలీనియర్ అయ్యేవాడిని ఏమో.. ఏదైనా సినీ నటుడిగా నేను పొందుతున్న తృప్తిని ఎన్ని లక్షల జీతాలు ఇచ్చే ఉద్యోగాలు అయినా మ్యాచ్ చెయ్యలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు రవి వర్మ.