Prabhas : పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ చేస్తున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కాస్త ఆటవిడుపు కోసం తక్కువ బడ్జెట్ తో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడు..పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద ప్రముఖ యంగ్ డైరెక్టర్ మారుతీ తో కొంత కాలం క్రితం ఒక సినిమాని ప్రారంభించాడు.’రాజా డీలక్స్’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ హారర్ జానర్ లో తెరకెక్కనుంది.ఇందులో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్ తో పాటుగా మాళవిక మోహన్ కూడా నటిస్తుంది.
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు మూడవ షెడ్యూల్ ని జరుపుకుంటుంది.ప్రభాస్ రేంజ్ ఇప్పుడు వేరే, ఆయన చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాలన్నీ వందల కోట్ల బడ్జెట్ తో ఉన్న సినిమాలే, అలాంటి ప్రభాస్ ఇలాంటి చిన్న ప్రాజెక్ట్ ఎందుకు ఒప్పుకున్నాడని ఫ్యాన్స్ మొదట్లో చాలా నిరాశకి గురయ్యారు.కానీ షూటింగ్ లొకేషన్స్ నుండి లీకైన ఫోటోలలో ప్రభాస్ లుక్స్ చూసి కాస్త సంతృప్తి చెందారు.
అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోవడం లేదట.తక్కువ బడ్జెట్ తో సినిమా చేద్దాం అనుకున్నాడు కాబట్టి తన పారితోషికం వల్ల నిర్మాతలకు అదనపు భారం పెరిగిపోతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.కానీ సినిమా విడుదలై లాభాలు వచ్చిన తర్వాత వాటాలు మాత్రం తీసుకుంటాడట.
అయితే ప్రభాస్ అంటే పాన్ ఇండియన్ సూపర్ స్టార్ కాబట్టి ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నారట.శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమాని ఈ ఏడాది లోనే విడుదల చెయ్యబోతున్నట్టు సమాచారం.అంటే ఈ ఏడాది లో ప్రభాస్ నుండి ఆది పురుష్, సలార్ తో పాటుగా రాజా డీలక్స్ మూవీ కూడా థియేటర్స్ లో ఆశించవచ్చు అన్నమాట.అలా ఈ ఏడాది మొత్తం పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ నామ సంవత్సరం గా నిలవబోతుంది.