Anasuya : అయ్యో అన‌సూయ ఏమైంది..? కంగారులో ఫ్యాన్స్..

- Advertisement -

Anasuya : అనసూయ బుల్లితెర ప్రేక్షకులకు పరిశ్రమ అక్కర్లేని పేరు.. యాంకర్ అంటే హీరోయిన్స్ కి తక్కువేమీ కాదు అంటూ అందాల ఆరబోత చేసి స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. అప్పటివరకు అందాల ప్రదర్శన చేయని యాంకర్స్ మెల్లమెల్లగా అనసూయ బాట పట్టారు. జబర్దస్త్ తో అనూహ్యమైన క్రేజ్ సంపాదించుకున్న బుల్లితెర యాంక‌ర్‌ సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా ఓ ఇన్స్టా రీల్ ను పంచుకోగా.. ఆ రీల్ లో అనసూయ తీరు కలవరపాటుకు గురి చేసింది..

Anchor anasuya | అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌
Anchor anasuya | అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌

తాజాగా అనసూయ భరద్వాజ్ పోస్ట్ చేసిన ఇన్ స్టా స్టోరీ ఆసక్తికరంగా మారింది. తన తలను పట్టుకున్న చిన్న వీడియోను షేర్ చేసింది. దాంతో ఏమైందంటూ ఫాన్స్ కాస్త కంగారు పడుతున్నారు. అందుకు ఆమె ఇలా బదులిచ్చారు. ఓ ఫంక్షన్ కి భోజనానికి వెళ్లానని.. ఆ ఫుడ్ తనకు పడలేదని.. దాంతో తిన్నదంతా బయటకు వచ్చేసింది అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తల పట్టుకుని కారులో నీరసంగా కూర్చున్నారు.

Anchor Anasuya Bharadwaj | అన‌సూయ
Anchor Anasuya Bharadwaj | యాంక‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌

ప్రస్తుతం పర్లేదని చెప్పారు. ఎప్పుడూ ఆక్టివ్ గా కనిపించే ముద్దుగుమ్మ‌ ను ఇలా నీరసంగా డల్ గా చూసి ఫాన్స్ త్వరగా మీరు నార్మల్ అవ్వాలి అంటూ పోస్టులు చేస్తున్నారు. ఎప్పుడూ చలాకీగా ఉండే అనసూయను ఫాన్స్ ఎలా చూడలేకపోతున్నారు. ఓవైపు టీవీ షో లతోపాటు మరోవైపు వెండితెరపై కూడా తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. రంగమ్మత్తగా రంగ‌స్థ‌లం సినిమాతో వెండితెరకు పరిచయమైన అనసూయ.. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఈ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది..

- Advertisement -

ఈమధ్య ఏ షో రూమ్ ఓపెనింగ్ కైనా చిన్న అకేషన్ ఏదైనా సరే త‌న అందంతో తళుక్కుమని మెరుస్తూ సందడి చేస్తోంది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ప్రస్తుతం ఈ జ‌బ‌ర్థ‌స్త్ యాంక‌ర్‌ కెరీర్ లో దూసుకెళ్తోంది. ఇటీవల మైకేల్ చిత్రంతో అనసూయ అలరించింది. పుష్ప ది రూల్, రంగమార్తాండ సినిమాల్లో నటిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here