Amigos Collections : హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రతీ సినిమాతో ప్రేక్షకులను సరికొత్త అనుభూతి కలిగించే సినిమాలు ఇవ్వాలని చూసే అతి తక్కువ మంది హీరోలలో ఒకడు కళ్యాణ్ రామ్.పాపం ఈ క్రమం లో ఆయన తన కెరీర్ లో ఎన్నో డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకొని మార్కెట్ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు.కానీ గత ఏడాది ‘భింబిసారా’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని సుమారుగా 40 కోట్ల రూపాయిల షేర్ మార్కుని సాధించాడు.
అలాంటి భారీ బౌన్స్ బ్యాక్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నుండి వచ్చిన చిత్రం ‘అమిగోస్’.రాజేందర్ రెడ్డి అనే నూతన దర్శకుడితో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు.టాక్ అయితే పాజిటివ్ గానే వచ్చింది కానీ,ఎంచుకున్న జానర్ వల్ల ప్రేక్షకుల్లో అంచనాలు లేకపోవడం తో కలెక్షన్స్ రావడం లేదు.ఇప్పటికే థియేటర్స్ లోకి వచ్చి మూడు రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా టోటల్ గా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.
మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా సుమారుగా రెండు కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. భారీ హిట్ తర్వాత వచ్చిన ఒక సినిమాకి ఈ రేంజ్ వసూళ్లు అంటే చాలా తక్కువ. మొదటి రోజు ట్రెండ్ ని చూసే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేదని ట్రేడ్ పండితులు అంచనా వేశారు.
అమిగోస్ సినిమాని కొన్న బయ్యర్స్ కి బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల్లోకి రావాలంటే 15 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టాలి, రెండవ రోజు కోటి 11 లక్షలు వసూలు చేసిన ఈ చిత్రం, మూడవ రోజు కేవలం 70 లక్షలు మాత్రమే రాబట్టింది అంచనా వేస్తున్నారు.ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ కలిపి కోటి రూపాయలకు పైగా గ్రాస్, మొత్తం మీద ఈ సినిమాకి 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని, ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధ్యమనే చెప్పాలి.