గత ఏడాది భారీ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మన తెలుగు ప్రేక్షకులందరినీ గర్వపడేలా చేసింది. హాలీవుడ్ లో కూడా గుర్తింపు ని దక్కించుకున్న ఈ సినిమా, ఏకంగా ఆస్కార్ అవార్డుని కూడా సొంతం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఈ సినిమా ఈ రేంజ్ కి వెళ్ళడానికి కచ్చితంగా రాజమౌళినే కారకుడు.
కానీ రామ్ చరణ్ , ఎన్టీఆర్ రాజమౌళి విజన్ కి తగ్గట్టుగా పని చేసి ఉండకపొయ్యుంటే ఈ స్థాయి విజయం అసలు దక్కేది కాదు. అందులో ఎలాంటి సందేహం లేదు , మెగా మరియు నందమూరి అభిమానుల్లో ‘నాటు నాటు’ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మరియు లిరిక్ రైటర్ చంద్ర బోస్ కి ఆస్కార్ అవార్డు దక్కడం లో కాస్త అసంతృప్తి ఉంది. ఎందుకంటే ‘నాటు నాటు’ సాంగ్ గొప్ప పాటేమి కాదు.
కీరవాణి, చంద్ర బోస్ కెరీర్ అంతకు మించి అద్భుతమైన పాటలు ఉన్నాయి. ఆ పాటకి ఆ స్థాయి రీచ్ రావడానికి ప్రధాన కారణం రాజమౌళి విజన్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్, ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రామ్ చరణ్ , ఎన్టీఆర్. వీళ్లిద్దరు పోటీపడి డ్యాన్స్ చెయ్యడం వల్లే ఆ పాటకి ఆస్కార్ అవార్డు వచ్చింది. కానీ ఈ మూడు ‘R’ లకు ఆస్కార్ స్టేజి మీద ఆస్కార్ అవార్డు ని ముట్టుకునే అదృష్టం కలగలేదు.
ఇక నిన్న ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ లో #RRR చిత్రానికి ఆరు క్యాటగిరీలలో అవార్డ్స్ వచ్చాయి. కానీ రామ్ చరణ్, ఎన్టీఆర్ మరియు రాజమౌళి కి మాత్రం ఒక్క అవార్డు కూడా రాలేదు. ఈ ముగ్గురు ‘R’ లలో ఒక్కరికి అవార్డు దక్కి ఉన్నా ఎంతో బాగుండేది అని అనిపించింది. రామ్ చరణ్ కి వస్తుందని అనుకున్నారు కానీ, చివరికి అల్లు అర్జున్ ని ఆ అవార్డు వరించింది.