Guess The Actor : ఈమె టాలీవుడ్ లో ఒక స్టార్ హీరోకి అక్క.. పెద్ద నిర్మాత కూడా.. ఎవరో గుర్తుపట్టగలరా?

- Advertisement -

Guess The Actor : ఈ క్రింది ఫోటో లో కనిపిస్తున్న మహిళ మన టాలీవుడ్ లో ఒక క్రేజీ యంగ్ హీరో కి స్వయానా అక్క అవుతుంది. ఈమె తండ్రి ఎప్పటి నుండో వ్యాపార రంగం లో ఉన్నాడు. ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసాడు. అలాగే ఎన్నో సినిమాలను నిర్మించాడు కూడా. ఇప్పుడు ఆయనకీ వయస్సు అవ్వడం తో ఆ నిర్మాణ బాధ్యతలు, డిస్ట్రిబ్యూషన్ పగ్గాలు అన్నీ ఈమెనే చేపడుతుంది.

Guess The Actor
Guess The Actor

ఈమె పేరు నిఖిత రెడ్డి, ఈమె ప్రముఖ యంగ్ హీరో నితిన్ కి అక్క అవుతుంది. నితిన్ వరుసగా 12 డిజాస్టర్ సినిమాలు తీసి కెరీర్ ని రిస్క్ లో పాడేసుకున్న సమయం లో ‘శ్రేష్ట్ మూవీస్’ ద్వారా ఆయనతో ‘ఇష్క్’ అనే చిత్రాన్ని నిర్మించి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందించింది. ఈ సినిమా తర్వాత ఆమె నితిన్ తో మరికొన్ని చిత్రాలను నిర్మించింది.

కేవలం నితిన్ తో మాత్రమే కాదు, ఇతర హీరోలతో కూడా ఈమె పలు సినిమాలను నిర్మించింది. అక్కినేని నాగార్జున చిన్న కొడుకు, అక్కినేని అఖిల్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసింది ఈమెనే. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ‘అఖిల్ ది పవర్ ఆఫ్ జువ్వ’ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఆమెకి భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.

- Advertisement -

అలాగే రీసెంట్ గా నితిన్ ని హీరో గా పెట్టి ‘మాచెర్ల నియోజకవర్గం’ సినిమా చేసింది. ఈ చిత్రం కూడా పెద్ద ఫ్లాప్ అయ్యింది. అలా ఈమె రీసెంట్ గా ఎక్కువ డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకొని నిర్మాతగా బాగా నష్టపోయింది. అందుకే కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక నిఖిత రెడ్డి కి 2017 వ సంవత్సరం లోనే అఖిలేష్ అనే వ్యక్తి తో పెళ్లయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here