Tollywood : ఈ ఏడాది 3 నెలల్లో ‘సున్నా’ షేర్ సాధించిన సినిమాలు ఏమిటో తెలుసా..?

- Advertisement -

Tollywood : ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా మన టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి, అలాగే డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం లోనే చిరంజీవి మరియు బాలకృష్ణ లాంటి లెజండరీ హీరోలు ‘వాల్తేరు వీరయ్య’ మరియు ‘వీర సింహా రెడ్డి’ వంటి సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ కి శుభారంభం పలికారు.కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలలో బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచినా చిత్రాలను చేతివేళ్ళతో లెక్కపెట్టొచ్చు.అంత తక్కువ ఉన్నాయి, తమిళ హీరో ధనుష్ నటించిన సార్,అలాగే జబర్దస్త్ కమెడియన్ వేణు తెరకెక్కించిన ‘బలగం’ చిత్రాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచి బయ్యర్స్ కి భారీ లాభాలు తెచ్చిపెట్టాయి.ఇక ఆ తర్వాత ‘దాస్ కా ధమ్కీ’ , ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి.ఈ సినిమాలు తర్వాత రీసెంట్ గానే న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ గా నిల్చింది.

Tollywood
Tollywood

అయితే వీటితో పాటుగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా తక్కువేమి కాదు, కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన ‘అమిగోస్’ , ‘మైఖేల్’, ‘బుట్టబొమ్మ’ వంటి చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.అయితే పైన చెప్పిన డిజాస్టర్ సినిమాలలో కొన్ని పది కోట్ల రూపాయిల లోపు షేర్ ని సాధించిన సినిమాలు అయితే,. మరికొన్ని 5 కోట్ల రూపాయిల షేర్ లోపు సాధించిన సినిమాలు కొన్ని.ఇవి రెండు కాకుండా కోటి రూపాయిల షేర్ ని కూడా వసూలు చెయ్యక జీరో షేర్స్ ని రాబట్టిన చిత్రాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము.

1 ) మీటర్ :

- Advertisement -
Meter Movie

‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం కాస్త మాస్ హీరో ఇమేజి కోసం కమర్షియల్ సినిమాగా ‘మీటర్’ అనే చిత్రాన్ని చేసాడు.రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు పాతిక లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది, రెండవ రోజు నుండి అన్నీ ప్రాంతాలలో జీరో షేర్స్ ని నమోదు చేసుకుంటుంది ఈ చిత్రం.కెరీర్ లో ఎదుగుతున్న సమయం లో ఇలాంటి డిజాస్టర్ పడడం నిజంగా కిరణ్ అబ్బవరం కి పెద్ద షాక్ అనే చెప్పాలి.

2) ఫలానా అబ్బాయి..ఫలానా అమ్మాయి:

palana ammai palana Abbai

నాగ శౌర్య మరియు శ్రీనివాస్ అవసరాల కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం ఇది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’ అనే చిత్రం ఎంత పెద్ద సూపర్ హిట్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే.మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ అవ్వడం తో ఈ చిత్రం మంచి బజ్ ఏర్పడింది కానీ, విడుదల రోజు నుండే డివైడ్ టాక్ రావడం తో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.మొదటి రోజు 60 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ సినిమా రెండవ రోజు నుండి జీరో షేర్స్ ని రాబట్టింది.

3 ) కళ్యాణం కమనీయం :

kalyanam kamaniyam

యంగ్ హీరో శోభన్ నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. సినిమా బాగానే ఉంది కానీ చిరంజీవి మరియు బాలయ్య లాంటి సూపర్ స్టార్ సినిమాలు ఇరగ కుమ్ముతున్న సమయం లో రావడం వల్ల డిజాస్టర్ ఫలితం ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఫుల్ రన్ లో కూడా జీరో షేర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com