Hanshik : ‘నేను శైలజ ‘ చిత్రం లో నటించిన ఈ బుడ్డోడు ఇప్పుడు ఎలా తయారయ్యాడో చూస్తే ఆశ్చర్యపోతారు!

- Advertisement -

Hanshik : ఎనెర్జిటిక్ స్టార్ రామ్ కెరీర్ లో క్లాసిక్ రేంజ్ స్టేటస్ ని దక్కించుకున్న సినిమా ‘నేను శైలజ’. వరుస ఫ్లాప్స్ లో ఉన్న రామ్ కి ఈ చిత్రం సక్సెస్ అవ్వడం తో ఆయన కెరీర్ కి మంచి బూస్ట్ దక్కింది. ఈ సినిమాతోనే కీర్తి సురేష్ హీరోయిన్ గా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అప్పట్లో ఈ చిత్రం లోని పాటలు ఒక సెన్సేషన్. యూత్ మొత్తం ఎక్కడ చూసిన ఈ పాటలు పెట్టుకొనే వినేవాళ్ళు.

Hanshik :
Hanshik

యూట్యూబ్ లో వందల మిలియన్స్ కి పైగా వ్యూస్ ఉన్నాయి ఈ సినిమాలోని పాటలకు. సినిమా కంటెంట్ కూడా అద్భుతంగా ఉంటుంది, ఎన్ని సార్లు చూసిన ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. అంత చక్కని స్క్రీన్ ప్లే రాసుకున్నాడు ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ కిషోర్ తిరుమల. ఇక పోతే ఈ సినిమాలో బాలనటుడిగా నటించిన మాస్టర్ హన్షిక్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి.

మాస్టర్ హన్షిక్ ఈ చిత్రం లో రామ్ చిన్నప్పటి పాత్ర పోషించాడు. ఎవరీ కుర్రాడు?, చాలా క్యూట్ గా ఉన్నాడు అని అప్పట్లో అందరూ అనుకున్నారు. ఈ చిత్రం విడుదలై అప్పుడే 7 ఏళ్ళు పూర్తి అయ్యింది. ఈ 7 ఏళ్లలో ఈ కుర్రాడు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఈ కుర్రాడు లేటెస్ట్ గా గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం లో చిన్నప్పటి చిరంజీవి పాత్ర పోషించాడు. ఇకపోతే ఈ కుర్రాడు ఇంస్టాగ్రామ్ లో చాలా యాక్టీవ్ గా ఉంటాడు.

- Advertisement -

అతనికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు మరియు రీల్స్ తో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ మొత్తం నింపేసాడు. చిన్నప్పుడు ఇతగాడు ఎంత క్యూట్ గా ఉండేవాడో, పెద్దయ్యాక కూడా అంతే క్యూట్ గా ఉన్నాడు. మోస్ట్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్న ఈ కుర్రాడు, సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇస్తాడో లేదో తెలియదు కానీ, ఒకవేళ ఎంట్రీ ఇస్తే మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇతనికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఎక్సక్లూసివ్ గా మీకోసం అందిస్తున్నాము చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here