KGF Yash : కేజీఎఫ్ 2 తర్వాత యశ్ నటిస్తున్న మూవీ టాక్సిక్. ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ నటి, దర్శకురాలు నీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టైటిల్ పోస్టర్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది పెద్ద మిస్టరీగా మారింది. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి.

ఇక తాజాగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ పేరు వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు రానప్పటికీ, ఫిల్మ్‌సర్కిల్స్ తో పాటు పలు బాలీవుడ్ వెబ్‌సైట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం, ఒక టాక్ షోలో, నటి కరీనా కపూర్ తనకు యశ్ అంటే ఇష్టమని అలాగే అతనితో నటించాలని ఉందని చెప్పింది. దీంతో కరీనా ఫిక్స్ అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే మేకర్స్ కరీనాతో చర్చలు చేశారని, ఆమె ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నట్లు తెలిపి, వెంటనే ఓకే చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ రూమర్ బయటకు రావడం ఆలస్యం.. కరీనాను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

హీరోయిన్ గానా.. లేక తల్లి పాత్రాకా.. ? అని కొందరు. యశ్ పక్కన కరీనా పెద్దదానిలా కనిపిస్తుందని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. అయితే అసలు కరీనాను హీరోయిన్ గా తీసుకుంటున్నారా.. ? లేక కీలక పాత్ర కోసం తీసుకుంటున్నారా.. ? అనేది తెలియాల్సి ఉంది. నిజం చెప్పాలంటే.. కరీనా హీరోయిన్ గా కంటే కీలక పాత్రలో నటిస్తేనే మంచి గుర్తింపు వస్తుంది అని ఆమె అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.