Mahesh Babu : రాజమౌళి సినిమాలో మహేశ్ చేయబోతున్న పాత్ర ఏదో తెలుసా.. సినిమాకు అదే హైలెట్ అట

- Advertisement -


Mahesh Babu : గ్లోబర్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఓ సంచలనాత్మకమైన సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ నెల నుంచి షూటింగ్ జరుపుకోనుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా పూర్తయిన వెంటనే మ‌హేష్‌.. రాజమౌళి సినిమాకు సంబంధించిన షూట్ లో బిజి అవ్వబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే, ఈ సినిమా పై పాన్ వరల్డ్ లో సోషల్ మీడియా వేదికగా చర్చలు మొదలయ్యాయి. సినిమాని భారీ బడ్జెట్లో దాదాపు రూ.1000కోట్ల వ్యయంతో రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ గురించి తీవ్ర చర్చలు నడుస్తున్నాయి. ఇంతకీ, ఈ సినిమా స్టోరీ ఏంటి.. ఏ జాన‌ర్‌కు సంబంధించింది అన్న న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇది ఒక అడ్వెంచర్స్ జాన‌ర్‌కి సంబంధించిన మూవీగా.. మరి కొన్నిసార్లు ఇది ఒక పాన్ వరల్డ్ లో జరిగే స్కామ్ కు సంబంధించిన సినిమా అని రకరకాలుగా ప్రచారం జరుగుతుంది.

ఇప్పటివరకు రాజమౌళి తీసిన సినిమాలన్నింటికి ఈ సినిమా భిన్నంగా ఉండబోతుందట. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్‌ ఇండియా మూవీలో ఎవరూ తెర‌కెక్కించని విధంగా రాజమౌళి సినిమాను హాలీవుడ్ కు సంబంధించిన టెక్నీషియన్స్, యాక్టర్లతో రూపొందించబోతున్నాడట. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక స్పై పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here