Sara Aliakhan : యశ్ నా ఫేవరేట్ హీరో.. ఛాన్స్ వస్తే సారా అలీఖాన్ తో నటిస్తానన్న కరీనా

- Advertisement -

Sara Aliakhan : స్టార్ హీరోయిన్ కరీనాకపూర్‌ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవలే కాఫీ విత్ కరణ్ షోలో ఆమె పాల్గొంది. మరో స్టార్ హీరోయిన్‌ ఆలియా భట్‌తో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా కరణ్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ముఖ్యంగా తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. సౌత్ స్టార్ హీరో యశ్ తో నటించాలని ఉందంటూ తన మనసులోని మాటను బయటకు పెట్టేసింది ముద్దుగుమ్మ.

Sara Aliakhan
Sara Aliakhan


సారా అలీఖాన్‌ కు తల్లిగా నటించే అవకాశం వస్తే నటిస్తావా? అంటూ కరణ్ జోహార్ ప్రశ్నించారు. దీనికి కరీనా స్పందిస్తూ నేను ముందుగా నటిని.. అన్ని వయసుల వారితో నటించగలను. ఎప్పుడైనా సారాకు తల్లిగా నటించే అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తా అని తెలిపింది. సారా అలీ ఖాన్.. సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య కుమార్తె. కరీనాతో పెళ్లికి ముందే సైఫ్ కు అమృతా సింగ్‌తో వివాహమైంది ఆమెతో 2004లో విడిపోయారు. సైఫ్, అమృతలకు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ జన్మించారు.
ఆ తర్వాత మీరు సౌత్‌లో ఏ హీరోతో నటించాలని కోరుకుంటున్నావ్? అని కరణ్ మరో ప్రశ్న వేసి.. కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ప్రభాస్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, యశ్‌లో ఎవరిని ఎంచుకుంటారు? అని ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ సౌత్ కి చెందిన కేజీఎఫ్ హీరో యశ్‌ యాక్టింగ్‌ చాలా ఇష్టమని.. ఆయన పక్కన నటించాలని ఉందంది. అయితే గతంలో కరీనా తాను సినిమాలు చూడనని.. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీని కూడా అందుకే చూడలేదని కరీనా చెప్పింది. కేజీఎఫ్ సినిమా చూశానని చెప్పడంతో కరణ్ షాక్ అయ్యాడు.
కాగా.. అక్టోబర్ 2012లో కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఏడాది కరీనా జానే జాన్‌తో ఓటీటీలో అరంగేట్రం చేసింది. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 21న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ప్రస్తుతం కరీనా ది క్రూని అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 22న రిలీజ్ కానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here