Srikanth : ఆ హీరో తో కలిసి నటించడం వల్లే నా కెరీర్ నాశనం అయ్యింది అంటూ శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Srikanth : ఒకప్పుడు హీరో గా యూత్ మరియు ఫామిలీ ఆడియన్స్ ని ఒక రేంజ్ లో అలరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్న శ్రీకాంత్, ప్రస్తుతం టాలీవుడ్ లో క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా శ్రీకాంత్ క్యారక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు.

Srikanth
Srikanth

ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఈ రేంజ్ లో ఉంటుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇక రీసెంట్ గా అయన హీరో గా ‘కోట బొమ్మాలి పీఎస్’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో ‘గేమ్ చేంజర్’ , ఎన్టీఆర్ తో ‘దేవర’ చిత్రాలు చేస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

క్యారక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని ప్రారంభించినప్పుడు శ్రీకాంత్ కి అన్నీ పాజిటివ్ రోల్స్ దక్కాయి. కానీ నాగ చైతన్య హీరో గా నటించిన ‘యుద్ధం శరణం’ చిత్రం లో విలన్ రోల్ చేసే అవకాశం వచ్చింది. చాలా రోజుల తర్వాత నెగటివ్ రోల్ లో చేసే అవకాశం రావడం తో శ్రీకాంత్ కూడా వెంటనే ఒప్పుకొని ఆ చిత్రం చేసాడట. కానీ ఆ సినిమా దారుణ పరాజయం పాలైంది.

- Advertisement -

విలన్ రోల్ చేసిన శ్రీకాంత్ కి కూడా పేరు రాలేదు. అతని సాఫ్ట్ ముఖానికి ఇలాంటి పాత్రలు సరిపడవు అని అప్పట్లో రివ్యూస్ కూడా వచ్చాయి. ఇది ఆయన కెరీర్ మీద చాలా ప్రభావం చూపించింది అట. కొన్ని రోజులు సినిమా అవకాశాలు లేక ఖాళీగా కూడా ఉండాల్సి వచ్చిందట. మళ్ళీ ఆయనకీ అఖండ చిత్రం కొత్త ఊపిరి పోసిందని, అప్పటి నుండి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదని శ్రీకాంత్ ఈ సందర్భంగా తెలిపాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here