Bigg Boss Telugu 7 టైటిల్ విన్నర్ కి ప్రైజ్ మనీ ఇవ్వరా..? ఇదేమి ‘ఉల్టా పల్టా’ అండీ బాబోయ్!

- Advertisement -

Bigg Boss Telugu 7 : ఈ సీజన్ బిగ్ బాస్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు ఆసక్తికరంగా ఉండడం మాత్రమే కాదు, హౌస్ లో జరిగిన కొన్ని పరిణామాలు కారణంగా బోలెడంత కంటెంట్ వచ్చింది. ఆ కంటెంట్ కారణంగానే రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. వీక్ డేస్ లో ఈ రియాలిటీ షో కి యావరేజి గా 7 కి పైగా రేటింగ్స్ వస్తున్నాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సీజన్ కి ఆడియన్స్ ఏ రేంజ్ లో బ్రహ్మరథం పట్టారు అనేది.

Bigg Boss Telugu 7
Bigg Boss Telugu 7

చూస్తూ ఉండగానే 12 వారాలు గడిచిపోయాయి. హౌస్ లో కేవలం 8 మంది మాత్రమే మిగిలారు. ఈ 8 మందిలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది ప్రస్తుతం ఉత్కంఠ గా మారింది. కచ్చితంగా అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ మరియు శివాజీ టాప్ 3 స్థానాల్లో ఉంటారని అందరికీ అర్థం అయిపోయింది.

Akkineni Nagarjuna

కానీ ఈ మూడు స్థానాల్లో ఎవరు ముందు ఉంటారు, ఎవరు వెనుక ఉంటారు అనేది మాత్రం తెలియడం లేదు. గత వారం అమర్ దీప్ టాప్ లో ఉండగా, ఈ వారం పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉన్నాడు. టైటిల్ విన్నింగ్ రేస్ ఈ ఇద్దరి మధ్యనే కొనసాగుతూ ఉంది. ఏ క్షణం లో అయినా మార్పు ఉండొచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ మొత్తం ‘ఉల్టా పల్టా’ అనే కాన్సెప్ట్ మీదనే నడిచింది.

- Advertisement -
Shivaji Amardeep

ఇది వరకు ‘ఉల్టా పల్టా’ ట్విస్టులు ఆడియన్స్ కి ఊహించిన రేంజ్ షాక్ ఇవ్వలేదు కానీ, ఫినాలే లో మాత్రం హౌస్ మేట్స్ తో పాటుగా ఆడియన్స్ కి కూడా ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్ ఇవ్వబోతున్నాడట బిగ్ బాస్. అదేమిటంటే ఈసారి టైటిల్ మరియు ప్రైజ్ మనీ కేవలం ఒకరికే దక్కదట. ఒకరు టైటిల్ కోరుకుంటే మరొకరు ప్రైజ్ మనీ ని త్యాగం చేయాలట. ఈ ట్విస్ట్ ఆడియన్స్ నుండి ఎలాంటి ఎలాంటి రియాక్షన్ పొందుతుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here