Srinu Vaitla : పవన్ కళ్యాణ్ సహకారం లేకపోతే ‘దూకుడు’ సినిమా ఉండేది కాదా..? వైరల్ అవుతున్న శ్రీనువైట్ల కామెంట్స్!

- Advertisement -

Srinu Vaitla : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఆయన ఒక స్క్రీన్ ప్లే రైటర్, కొరియోగ్రాఫర్ మరియు డైరెక్టర్ కూడా. ఒక్కప్పుడు ఆయన నటించే ప్రతీ సినిమాలో పవన్ కళ్యాణ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో తనవంతు సహకారం అందించేవాడు. ‘తమ్ముడు’ సినిమా మొత్తానికి ఆయనే దర్శకత్వం వహించాడు, అంతే కాకుండా అప్పట్లో ఆయన చిత్రం లోని పాటలు స్వయంగా ఆయనే కొరియోగ్రఫీ చేసుకునేవాడు.

Srinu Vaitla
Srinu Vaitla

ఖుషి చిత్రం లో ఎన్నో సన్నివేశాలను పవన్ కల్యాణే రాసాడు. ఈ విషయం ఆ చిత్ర దర్శకుడు ఎస్ జె సూర్య ఒక ఇంటర్వ్యూ లో బహిరంగంగా చెప్పాడు కూడా. అలాగే 7 వ చిత్రం జానీ కి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆయన ‘గుడుంబా శంకర్’ చిత్రం చేసాడు, ఈ చిత్రానికి ఆయన స్క్రీన్ ప్లే అందించాడు.

అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ,ఇదే సినిమా స్క్రీన్ ప్లే ని కొన్నేళ్ల తర్వాత కాపీ కొడుతూ పలు సినిమాలు వచ్చాయి. అవి మాత్రం పెద్ద సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ చిత్రాలను తీసే శ్రీనువైట్ల రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ , ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయన సినిమాల్లోని కామెడీ ని నేను బాగా ఎంజాయ్ చేస్తాను.

- Advertisement -

గుడుంబా శంకర్ చిత్రం స్క్రీన్ ప్లే ని నేను చాలా సినిమాలకు వాడాను, వాటిల్లో దూకుడు చిత్రం అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. పవన్ కళ్యాణ్ గారితో అప్పట్లో సినిమా చెయ్యడానికి చాలా ప్రయత్నం చేశాను, కానీ కుదర్లేదు, ఎదో ఒకరోజు మా కాంబినేషన్ వస్తుందని ఆశిస్తున్నాను, ఒకవేళ ఓకే అయితే మాత్రం నా బెస్ట్ ఇస్తాను అంటూ శ్రీను వైట్ల కామెంట్ చేసాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here